#సాంస్కృతికం

క్రోధి నామ సంవత్సర పంచాంగమును ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హిందుపురాణాల ప్రకారం మనకు 60 తెలుగు సంవత్సరాలు ఉన్నాయి. అవి ప్రతి ఏడాది చైత్రమాసం శుద్ధపాడ్యమి నుంచి ప్రారంభమౌతుంది. అందుకే ఆరోజు నుంచి కొత్త ఉగాది వేడుకలను నిర్వహించుకుంటాం.

ఈసారి తెలుగు సంవత్సరానికి క్రోధి అని పేరు.ఈ నేపథ్యంలో…క్రోధి నామ సంవత్సర పంచాంగమును రాష్ట్ర ఐటి, సాంకేతిక మరియు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు మంథని నియోజకవర్గం కేంద్రంలో న్యాయవాది శశిభూషణ్ కాచె ఆధ్వర్యంలో సోమవారం ఆవిష్కరణ గావించారు.

బ్రహ్మశ్రీ గాడిచెర్ల నారాయణ సిధ్దాంతి మనుమడైన బ్రహ్మశ్రీ గాడిచెర్ల నాగేశ్వరరావు సిధ్దాంతి చే గుణించబడిన క్రోధి నామ సంవత్సర పంచాంగమును జాతీయ దినపత్రిక తెలంగాణ రిపోర్టర్ ఎడిటర్ సిరిసిల్ల శ్రీనివాస్ మద్రణ గావించడం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ…మనిషి జీవనవిధానానికి దిశా నిర్దేశం చూపేదే పంచాంగం అన్నారు. తిథి, వార, నక్షత్రము, 

యోగం, కరణంలతో కూడిన పంచాంగం మనలో ఉండే మేధాసంపత్తిని ప్రజ్వలింపజేస్తాయన్నారు. 

తెలుగు పంచాంగంలో వీటి ఆధారంగానే భవిష్యత్తులో జరగబోయే విషయాలను ఊహించి చెబుతారనీ… ఇందులో తిథి ఆదాయాన్ని, వారం ఆయువును, నక్షత్రం పాపప్రక్షాళనను, యోగం వ్యాధి నివారణలను, కరణం పవిత్ర గంగానదిలో చేసినంత పుణ్యఫలాన్ని అందిస్తుందని చాలా మంది విశ్వసిస్తారన్నారు. ఈ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని అందించాలనీ…రాష్ట్ర ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్ష వ్యక్తం చేశారు. 

కాగా, క్రోధినామ సంవత్సర తెలుగు పంచాంగమును ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుగారికి తెలంగాణ రిపోర్టర్ ఎడిటర్ సిరిసిల్ల శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలుపుతూ, ఉగాది శుభాకాంక్షలు అందజేశారు. అలాగే ఈ ఆవిష్కరణకు సహకరించిన మిత్రులు, న్యాయవాది శశిభూషణ్ కాచె కు మరియు పాల్గొన్నవారికి సిరిసిల్ల శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *