#తెలంగాణ

నకిలీ వైద్యులు, అర్హత లేని వైద్యంపై టీజీఎంసి కొరడా

వేములవాడ సిరిసిల్లల్లో పలు క్లినిక్స్ పై టీజీఎంసీ బృందం తనిఖీలు…
(రిపోర్టర్, సంపత్ పంజ): రాజన్న సిరిసిల్ల జిల్లా

తెలంగాణా వైద్య మండలి చైర్మన్ డా మహేష్ కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ లాలయ్య ఆదేశాల మేరకు సభ్యులు డాక్టర్ బండారి రాజ్ కుమార్ ఆధ్వర్యంలోని యాంటీ క్వేకరి బృందం పలు వైద్యుల సెంటర్స్ పై తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీలలో… సిరిసిల్లలోని గాంధీ గోపాలరావు నగర్ కి చెందిన బాబా క్లినిక్ నిర్వహిస్తున్న మాదాసు లక్ష్మణ్, పోతుగల్ రోడ్డు ముస్తాబాద్ లోని ముక్తార్ హాస్పిటల్ నిర్వహిస్తున్న ఆర్ఎంపి ముక్తర్ మరియు వేములవాడ లోని గాంధీ నగర్ కు చెందిన అశ్విని క్లినిక్ నిర్వహిస్తున్న బెజ్జంకి రవీందర్ లు విచ్చలవిడిగా యాంటీబయాటిక్ ఇంజక్షన్లు ఇస్తున్నట్లు గుర్తించారని తెలుస్తుంది.వీరి వద్ద హేతుబద్ధత లేకుండా రోగులకు ఇచ్చిన యాంటీబయాటిక్ ఇంజక్షన్లు వందల సంఖ్యలలో బయటపడ్డాయని తెలుస్తుంది. ఆసుపత్రి రిజిస్ట్రేషన్ లేకుండా ఆధునిక వైద్యం చేయడానికి కనీస విద్య అర్హత లేకుండా కొంతమంది పదవ తరగతి మాత్రమే చదివి ఐదు నుంచి పది బెడ్స్ వేసి ఇన్ పేషెంట్ వైద్యం కూడా చేస్తున్నట్లు గుర్తించారని సమాచారం.

పలువురు వైద్యుల పేరిట అల్లోపతి వైద్యం చేస్తూ పట్టుబడ్డట్టు తెలుస్తుంది. పలు సెంటర్స్ ఓపెన్ చేసి అర్హత లేకుండా వైద్యం చేస్తున్నారని వెలుగులోకి వచ్చింది.

తనిఖీలలో విచ్చలవిడిగా ఆంటిబయోటిక్స్, స్టెరోయిడ్స్ ఇస్తునట్టు గుర్తించి తగు ఆధారాలు సేకరించారు.
Nmc చట్టం 34,54 ప్రకారం వీరిపై కేసు నమోదు చేయనున్నారు. ఎన్ఎంసి చట్టం ప్రకారం విద్యార్హత లేకున్నా అల్లోపతి వైద్యం చేసినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు.ఇలాంటి వైద్యులపై ఇప్పటివరకు 300 కేసులు నమోదయినాయి. త్వరలో కోర్టులో హాజరు పరిచి చట్టపరంగా శిక్షించబడతారని టీజీఎంసీ మెంబర్ డాక్టర్ బండారి రాజ్ కుమార్ పేర్కొన్నారు.

చట్ట ప్రకారం అర్హత లేని వ్యక్తులకు ట్రైనింగ్ ఇవ్వడం, ప్రాక్టీస్ చేయడం చట్టవిరుద్దo అని గతంలో కూడా పలుసార్లు జి.ఒ లు ఇవ్వగా కోర్టులు ఆ జి.ఒ లను రద్దు చేసిందని గుర్తు చేసారు.

ఈ తనిఖీలలో టీజీఎంసీ మెంబర్ డాక్టర్ బండారి రాజకుమార్, భరత్ సహా ఆంటీ క్వాకరీ బృందం మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. త్వరలో వీరందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠినంగా శిక్షించబడతారని తెలంగాణ వైద్య మండలి 30 బృందాలు రాష్ట్రమంతట ప్రతి జిల్లాలలో, ప్రతి గ్రామంలో ఈ తనిఖీలు ఇలాగే కొనసాగుతాయని, పరిమితి మించి వైద్యం చేసినట్టు గాని గుర్తిస్తే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడినందుకు కఠినంగా శిక్షించడంలో ఉపేక్షించేది లేదని టీజీఎంసి మెంబర్
డాక్టర్ బండారి రాజ్ కుమార్ హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *