# Tags
#తెలంగాణ #జగిత్యాల

పెద్ద చెరువును ఎస్సారెస్పీ నీటితో నింపాలి : రైతు నాయకులు తురగ శ్రీధర్ రెడ్డి

రాయికల్ : S. Shyamsunder

వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో నీటి కష్టాలు రాకుండా పెద్ద చెరువుnu ఎస్సారెస్పీ నీటీ తోనింపాలని రైతు నాయకులు తురగ శ్రీధర్ రెడ్డి అన్నారు.

రాయికల్ పట్టణ పెద్ద చెరువు ను ఎస్సారెస్పీ డి- 52కెనాల్ నీటితో నింపాలని రాయికల్ తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాహసిల్దార్ కు మంగళవారం రైతులు వినతి పత్రాన్ని అందించారు.

గత సంవత్సరం చెరువులో నీటి స్థాయి అధికంగా ఉందని ప్రస్తుతం చెరువులోని నీటి భూగర్భ స్థాయికి చేరేలా ఉందని అన్నారు. త్రాగు, సాగునీటి కష్టాలు రాకుండా అధికారులు ముందస్తు అప్రమత్తమై చెరువులో నీళ్లు నింపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుతారి తిరుపతి,ముత్యం రాజు, మహేష్ గౌడ్ గంగారెడ్డి,రాము,పడాల గోపి,సత్యం,నరేందర్ రైతులు తదితరులు పాల్గొన్నారు.