# Tags

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన అభినందనీయం :లయన్ రీజినల్ చైర్మన్ గుంటుక సురేష్

రాయికల్ : (S.శ్యామసుందర్) :

నిరుపేద విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు లయన్స్ క్లబ్ సహకారం అభినందనీయం లయన్ రీజినల్ చైర్మన్ గుంటుక సురేష్ బాబు అన్నారు.

సోమవారం రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో నీటి వినియోగ సౌకర్యార్థం 1000 లీటర్ వాటర్ ట్యాంక్,పదవతరగతి విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు లయన్ రీజినల్ చైర్మన్ గుంటుక సురేష్,డిసి మ్యాకల రమేష్,ఆడెపు రాంప్రసాద్ ల సహకారంతో మూడు బ్యాగుల అటుకుల బ్యాగులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యతోనే ఉన్నత స్థాయికి చేరుకుంటారని ప్రతి విద్యార్థి కష్టపడి చదవాలని సూచించారు.రాబోయే కాలంలో లయన్స్‌ క్లబ్‌ సేవలను ప్రభుత్వ పాఠశాలల్లో మరింతగా విస్తృతంగా అందించాలన్నారు.లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నవంబర్ మాసంలో డయాబెటిక్ పై ప్రజలకు అవగాహన కల్పించి డయాబెటిక్ శిబిరాలు నిర్వహిస్తున్నామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొత్తపెళ్లి రంజిత్,కోశాధికారి బెక్కం తిరుపతి,డిసి బత్తిని భూమయ్య,ఉపాధ్యక్షులు వాసం స్వామి,లయన్స్ క్లబ్ సభ్యులు మచ్చ శేఖర్,దాసరి గంగాధర్,కొయ్యేడి మహిపాల్,కాటిపెల్లి రాంరెడ్డి,ఆడెపు రాంప్రసాద్,సుదవేణి మురళి,నిమ్మల వెంకట్ రెడ్డి,ఎలిగేటి అనిల్,కట్ల నర్సయ్య,పారిపెళ్లి శ్రీనివాస్, సాంబారు శ్రీనివాస్, మండల విద్యాధికారి రాఘవులు,ఉపాధ్యాయులు పొన్నం రమేష్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.