# Tags
#తెలంగాణ

ఈ ఏడాదిన్నరలోపే 56 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే -రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు

అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపే 56 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు

ధర్మపురి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రోజున ధర్మపురి పట్టణంలోని స్థానిక బ్రాహ్మణ సంఘం హాల్ప లో పట్టభద్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ,ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

అనంతరం రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపే 56 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని,నిరుద్యోగుల నైపుణ్యాన్ని పెంచే విధంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ ప్రారంభించామని వివరించారు.

గత ప్రభుత్వ హయంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని, ఓటమి భయంతోనే నరేందర్ రెడ్డి పైన కొందరు దుష్ప్రచారం చేయడం జరుగుతుందని అన్నారు.

317 జీవో సడలింపుపై న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నామని,మేనిఫెస్టోలో చెప్పిన విధంగా డిఎస్సీ నిర్వహించి,నియామకాలు చేపట్టడం జరిగిందని అన్నారు.

నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని ఈ సందర్భంగా అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.