# Tags

కొడిమ్యాల మండల కేంద్రంలో గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు శాఖను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

కొడిమ్యాల :

మండల కేంద్రంలో గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు శాఖను జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ప్రారంభించారు.

గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 68వ శాఖను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సోమవారం ఉదయం 11-30 గంటల ప్రాంతంలో కొడిమ్యాల మండల కేంద్రంలో ప్రారంభించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…

గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక బ్యాంకు సేవలందిస్తున్న గాయత్రి అర్బన్ బ్యాంక్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతూ, ఉన్నతంగా ఎదగాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి సి హెచ్. మనోజ్ కుమార్, జగిత్యాల ఆర్డీవో పి. మధుసూదన్, తహసీల్దార్ కిరణ్ కుమార్, ఏం పి డి వో స్వరూప, గాయత్రి అర్బన్ బ్యాంకు సి ఈ వో వనమాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.