(మంథని : సిరిసిల్ల శ్రీనివాస్)
* రాజకీయ ఓనమాలు నేర్పిన ఘనత స్వర్గీయ శ్రీపాద రావుది
* శ్రీధర్ బాబుపై వారి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే యావత్తు తెలంగాణ సమాజం ఊరుకోరని పుట్ట మధుకు హెచ్చరిక
* మతిబ్రమించి మాట్లాడుతున్న పుట్ట మధూ!
రానున్న రోజుల్లో నీ పుట్ట పలుగుడు ఖాయం
* యువ నాయకులు శ్రీను బాబు ఒక్క సైగ చేస్తే, యూత్ కాంగ్రెస్ నాయకులు తరిమితరిమి కొడతారు, తస్మాత్ జాగ్రత్త మధూ….అంటూ మంథని కాంగ్రెస్ నాయకులు,

మంథని నియోజకవర్గం శాసనసభ్యులు మరియు ఐటి, పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మరియు వారి కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన పుట్ట మధుకు వ్యతిరేకంగా, ఆయన తీరుపట్ల మంథని, రామగిరి, కమాన్పూర్ ముత్తారం మండలాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం డా.బి.ఆర్ అంబేద్కర్ చౌరస్తాలో విలేఖరుల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండి పడ్డారు.

ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ, రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు మెంబర్ శశిభూషణ్ కాచే, జిల్లా ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం,మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న,ప్రచార కమిటీ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, ప్యాక్స్ చైర్మన్లు కొత్త శ్రీనివాస్, ఇనగంటి భాస్కరరావు,మాజీ జెడ్పిటిసి గంట వెంకటరమణారెడ్డి,మార్కెట్ వైస్ చైర్మన్ మద్దెల రాజయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమ,మాజీ కౌన్సిలర్ కొలిపాక సుజాత, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, లద్నాపూర్ సర్పంచ్ రామచందర్రావు, సీనియర్ నాయకులు మహేశ్వరావు కోలేటి మారుతి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ఈసమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు పట్ల, వారి కుటుంబం పట్ల పుట్ట మధు చేసిన వ్యాఖ్యలపై, వారు తీవ్ర ఆగ్రహంతో మాట్లాడుతూ,
పుట్ట మధుకు రాజకీయ భిక్ష పెట్టింది దుద్దిళ్ళ కుటుంబం అన్నారు. పుట్ట మధు రాజకీయ చరిత్ర అందరికి తెలుసు, నువ్వు ఏ స్థాయి నుంచి ఎలా ఎదిగావో ఏందనేది ఈ మంథని ప్రజలందరికీ తెలుసన్నారు.
స్వర్గీయ శ్రీపాద రావు చేరదీసి నీకు రాజకీయ ఓనమాలు నేర్పి, ఎంపీటీసీగా, జెడ్పిటిసిగా అనేక పదవులు కట్టబెట్టి నిన్ను ఒక రాజకీయ నాయకుడిని చేసిన ఘనత స్వర్గీయ శ్రీపాద రావు గారిది, దాన్ని గుర్తుపెట్టుకోవాలని హియహవు పలికారు.

అలాంటి కుటుంబంపై స్థాయి మరిచి కృతఘ్నతతో పుట్ట మధు పిచ్చి పట్టినట్లుగా మాట్లాడం ఆయన అవివేకానికి నిదర్శనం అన్నారు.
బహుజనవాదం, బహుజనవాదం అంటూ విర్రవీగుతున్నావ్ బహుజనులను ఎంతమందిని నువ్వు నాయకులు తయారు చేశావో అంబేద్కర్ సాక్షికి ప్రమాణం చేసి చెప్పాలని పుట్ట మధును డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడైనా, ఏనాడైనా ప్రెస్మీట్లో నీ యొక్క భార్యను గాని, నీ బిడ్డను, నీ కొడుకును, నీ అల్లుడు ను గానీ, మీ కుటుంబ సభ్యులను ప్రస్తావించామా అనేది గుర్తుంచుకోవాలని, రాజకీయాల్ని కుటుంబాలకు తీసుకురావద్దని హితవు పలికారు.

మంత్రి శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గంకు తెస్తున్న నిధులను, వారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకుండ తనను మళ్ళీ వచ్చే ఎలక్షన్లో నియోజకవర్గం తప్పకుండా ఓడగొడతారన్న విషయం అర్థం చేసుకొని, మంత్రి శ్రీధర్ బాబును, వారి కుటుంబంపై అసభ్య పదజాలం వాడుతూ, వారి ఫై బురద చల్లడంను ప్రజలు గమనిస్తున్నారన్నారు.
ఇకపై మంత్రి శ్రీధర్ బాబుపై గానీ, వారి కుటుంబంపై గానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే యావత్తు తెలంగాణ సమాజం, కాంగ్రెస్ పార్టీ, మంథని నియోజకవర్గం ప్రజలు చూస్తూ ఊరుకోరని పుట్ట మధును హెచ్చరిస్తూ, పద్దతి మార్చుకోక పోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
పదేపదే 40 సంవత్సరాలు బానిసలు, బానిసలు అని మాట్లాడుతున్నావ్, ఇక్కడి ప్రాంత ప్రజలు 40 సంవత్సరాల నుంచి ఎందుకు ఆ కుటుంబాన్ని గెలిపిస్తున్నారనేది నువ్వు గ్రహించకుంటే అది నీ ఖర్మ అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతూ రాత్రింబవళ్లు ఈ మారుమూల ప్రాంతానికి అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో తమ నాయకుడు శ్రీధర్ బాబు కృషి చేస్తున్నారని అన్నారు.
రానున్న రోజుల్లో పుట్ట మధూ! నీ పుట్ట పలుగుడు ఖాయం, ఈ ప్రాంత ప్రజలందరూ నీకు బుద్ధి చెప్పి, నీ తట్ట బుట్ట సదురుకొని ఈ మంథని ప్రాంతం నుంచి తరిమి కొడతారని హెచ్చరించారు.
నీ పెళ్ళి ఎట్లా జరిగిందో అన్నీ మాకు తెలుసు కదా,ఆనాడు ఏమి లేని నువ్వు వందల కోట్లు ఎలా సంపాదించావు, వెంకటాపూర్లో వందల ఎకరాలు, ఫ్లాట్లు,కార్లు విలాసమైనంత భవనాలు ఎక్కడి నుండి వచ్చాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో తెలంగాణ వచ్చిందని టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి ఆప్రజాస్వామ్యంగా , దాదాపు పది సంవత్సరాలు పార్టీ నడిపించిన రామ్ రెడ్డిని మోసంచేసి,మీ కవితక్క దగ్గరకు డబ్బుల మూటలు పట్టుకెళ్ళి రాంరెడ్డికి రావాల్సినటువంటి సీటును తెలంగాణ సెంటిమెంటుతో తెచ్చుకుని గెలిచిన నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావా అని మధును అని ప్రశ్నించారు.
నువ్వు పదే పదే శ్రీధర్, శ్రీధర్ అని ఏకవచనంతో మాట్లాడుతున్నావ్, నిన్ను అరె పుట్టమధు అనలేక కాదు మా నాయకుడు, అందరిని మర్యాదగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని క్రమ పద్ధతిలో వెళ్లాలని సూచిస్తున్నారు, కాబట్టి మేము ఆగుతున్నాం. అదే మా యువ నాయకులు శ్రీను బాబు ఒక్క సైగ చేస్తే యూత్ కాంగ్రెస్ నాయకులు తరిమితరిమి కొడతారు అని గుర్తు పెట్టుకో పుట్ట మధూ! తస్మాత్ జాగ్రత్త అని మండిపడ్డారు.
నీ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా, చీమల దండులాగా ఏకమై, “మేము సైతం” అని చెప్పి, పుట్టలో వచ్చే పుట్ట నుండి పుట్టను పలగొట్టే విధంగా స్పందించేందుకు ఈ రోజు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరూ, చీమల దండులాగా కదులుతున్నారు జాగ్రత్త అన్నారు.
పుట్ట మధూ, ఖబర్దార్! గోతి ఎవరో తవ్వుకోరు—నువ్వే తవ్వుకుంటున్నావు. ఆ గోతి నీ గోతి…. కాలగర్భంలో కలిసిపోయే రోజులు దగ్గరపడ్డాయన్నారు.

అనుచితంగా మాట్లాడుతూ, మా నాయకుల గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి చరిత్ర తెలుసు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నావు. “ఇంట్లో తిన్నావు” అంటూ మాట్లాడుతున్న తీరు ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. నువ్వు మాట్లాడే పద్ధతి, అది సంస్కారానికి విరుద్ధం అన్నారు.
నువ్వు “అరే” అని మాట్లాడవచ్చు. మేము కూడా అలాగే మాట్లాడగలము. కానీ మా నాయకులు శ్రీధర్ బాబు
మాకు ఆ సంస్కృతి నేర్పలేదు. వారి అడుగుజాడల్లో నడుస్తున్నాము. మా అమ్మానాన్నలు గానీ, దుద్దిళ్ల కుటుంబం గానీ మాకు నేర్పిన సంస్కృతి—గౌరవం ఇవ్వడం, గౌరవం పొందడం మాత్రమే అని అన్నారు.
ఒకడు తప్పు చేస్తే మనం తప్పు చేయాల్సిన అవసరం లేదని చెప్పి, శాంతిభద్రతలను కాపాడాలని మాకు హితబోధ చేశారన్నారు.
అందుకే అంబేద్కర్ సాక్షిగా, నీకు బుద్ధి చెప్పడానికి రావడం జరిగిందనీ, *డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఎక్కడైనా “అమర్యాదగా మాట్లాడే” పదాలు ఉన్నాయా? చూపించగలవా? అని ప్రశ్నించారు.
రాష్ట్ర స్థాయిలోనే కాదు, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా తిరిగి, తెలంగాణకు నిధులు తీసుకొచ్చి, కంపెనీలు ఏర్పాటు చేసి, నిరుద్యోగ సమస్య తగ్గించేందుకు రోజుకు 20 గంటలు పని చేసే మా నాయకులు శ్రీధర్ బాబు పట్ల అమర్యాదగా మాట్లాడే అర్హత నీకు లేదన్నారు.
అంతేకాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే పేరు నీ నోటి నుండి రావడానికి నువ్వు అర్హుడివి కాదు. ఇంకొకసారి మా నాయకుల కుటుంబం గురించి మాట్లాడితే, అన్నీ బయటపెట్టే రోజు కూడా వస్తుందని హెచ్చరిస్తున్నామని మండిపడ్డారు.
ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడితే, ముందు వరుసలో మా నాయకులే ఉంటారు…తరిమి కొడతారు. ఖబర్దార్ బిడ్డా, ఇప్పటివరకు ఓపికతో, సహనంతో నిలబడ్డాము. ఆ ఓపికను పనికట్టుకొని మరీ మాట్లాడితే, ఫలితం వేరేలా ఉంటుంది అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల అధ్యక్షులు, సర్పంచులు,మార్కెట్ కమిటీ చైర్మన్లు,నూతన సర్పంచ్లు, బ్లాక్ కాంగ్రెస్,సీనియర్ కాంగ్రెస్,నాలుగు మండలాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్,యూత్ కాంగ్రెస్ నాయకులు, దుద్దిళ్ళ కుటుంబ అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనడం
జరిగింది.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





