# Tags

జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జీవోను సవరించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా : (సంపత్ పంజా):

అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలి

జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి….

ఈనెల 27న జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమాలు :

టీయూడబ్ల్యూజే హెచ్ 143 జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా

అర్హులైన ప్రతి జర్నలిస్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు దక్కేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా డిమాండ్ చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అoతగిరి రిజర్వాయర్ వద్ద బుధవారం యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు.

సమావేశ ప్రారంభంలో వివిధ కారణాలవల్ల ఇటీవల మరణించిన జర్నలిస్టులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.

అనంతరం లాయక్ పాషా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని ,మీడియా అకాడమీ ను డిమాండ్ చేశారు.

ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 252 ద్వారా జర్నలిస్టులకు తీరని నష్టం వాటిల్లుతుందని వెంటనే ప్రభుత్వం జీవో ను సవరించాలని కోరారు. లేనియెడల ఈనెల 27న జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు జిల్లావ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులను ఏకం చేసి నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.

జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం అల్లం నారాయణ నేతృత్వంలోని టీయూడబ్ల్యూజే సంఘం ఎల్లప్పుడూ పోరాటం చేసిందనీ, రాబోయే రోజుల్లో జర్నలిస్టుల పక్షాన ఉద్యమాలు చేస్తుందని భరోసా ఇచ్చారు. యూనియన్ సభ్యులకు టియుడబ్ల్యూజే హెచ్ 143 ఐడి కార్డులను అందజేశారు.

మండలాల వారిగా సంఘ బలోపేతం ,సభ్యుల సంక్షేమo, హక్కుల సాధన కోసం కలిసికట్టుగా ముందుకు సాగాలని సూచించారు.

సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సామల గట్టు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా టెంజు అధ్యక్షులు ఇరుకుల్ల ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి అజీమ్ లతోపాటు జిల్లా కార్యవర్గం సభ్యులు, ఇల్లంతకుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాజు, గుర్రాల మోహన్, శ్రీనివాస్ ,పరశురాం ఎల్లారెడ్డిపేట పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.