# Tags

అనారోగ్యంతో మంచానపడిన అర్జీదారు వద్దకే భూమి రిజిష్టేషన్ ప్రక్రియ

రాయికల్ : ఎస్.శ్యాంసుందర్

ప్రజల వద్దకే పాలన లో తహశీల్దార్ నాగార్జున :

రాయికల్ మండల తహశీల్దార్ నాగార్జున మంగళవారం సాయంత్రం అర్జిదారు వద్దకే వెళ్లి భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేశాడు.

వివరాల ప్రకారం మల్లాపూర్ మండలం దామరాజుపల్లి గ్రామానికి చెందిన కంటె చిన్న మల్లయ్య రాయికల్ పట్టణ శివారులోని తన భూమిని ఇటిక్యాల గ్రామానికి చెందిన రొట్టె పద్మ కు అమ్మకం గావించాడు.

రిజిస్ట్రేషన్ లో భాగంగా అర్జిదారు కంటే చిన్న మల్లయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్నాడని తెలుసుకొన్న తహసీల్దార్ నాగార్జున ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన అన్నట్లుగా దామరాజుపల్లి అర్జీ దారు ఇంటివద్దకే వెళ్లి ఐరిస్ మరియు ఈ-కే వై సి సంతకాలు తీసుకొని రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి పత్రాలు అందచేశారు.