# Tags
#తెలంగాణ #జగిత్యాల

జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాలతో హాస్టల్ లను పరిశీలించిన ఎంపిఓ బృందం

వెల్గటూర్ :(జగిత్యాల జిల్లా):

TSMS- బాలికల హాస్టల్, కుమ్మరిపల్లి వార్డెన్ శ్రీమతి సునీత మరియు ANM, పంచాయతీ కార్యదర్శి కరుణాకర్, ఫీల్డ్ అసిస్టెంట్ సతీష్ తో కలిసి వెల్గటూర్ మండల పంచాయతీ అధికారి జక్కుల శ్రీనివాస్ పరిశీలించారు.

100 మంది విద్యార్థులతో ఉన్న ఈ హాస్టల్ లోని సౌకర్యాలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాలతో ఆదివారం ఉదయం 8 గంటలనుండి మధ్యాహ్నం 2 గంటల వరకు TSMS- బాలికల హాస్టల్, కుమ్మరిపల్లితో పాటు ఎండపల్లి ఎస్ సి బాలుర హాస్టల్ ను వార్డెన్ అఫ్సర్ తో కలిసి పరిశీలించారు. హాస్టల్ వంటగదితో పాటు లోపలి పరిసరాలు, స్టోర్ రూమ్ లో పరిశుభ్రత పట్ల సంతృప్తిగా ఉన్నాయన్నారు.

అలాగే, విద్యార్థులతో సమావేశమై, హాస్టల్ లో భోజనం, త్రాగునీటి సౌకర్యంపై వారితో చర్చించారు. ఈ అంశంలో భోజనం, త్రాగునీటికి సంబంధించి విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు.అలాగే, రాత్రి వేళల్లో విద్యుత్ సమస్య లేదన్నారు.హాస్టల్ ప్రాంగణంలో పారిశుధ్యంపై గ్రామపంచాయతీ కార్మికులు హాస్టల్‌లో రెగ్యులర్ గా శానిటేషన్ చేస్తున్నారని విద్యార్థులు, సిబ్బంది సంబంధిత విచారణ అధికారులకు చెప్పుకొచ్చారు.

అయితే మొత్తంగా హాస్టల్ పరిస్థితి బాగానే ఉంది కానీ, భద్రత కోసం అన్ని కిటికీలకు దోమల మెష్ అవసరం అని, అవి సమకూర్చాలని విద్యార్థులు కోరారు. ఈ మేరకు మండలంలోని ప్రభుత్వ విద్యాసంస్థలు, హాస్టల్ లను పారిశుధ్యము, సౌకర్యాలు, విద్యార్థులకు భోజనం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాలతో నిరంతర పర్యవేక్షణ చేయడం జరుగుతుందని వెల్గటూర్ ఎంపిఓ జక్కుల శ్రీనివాస్ తెలిపారు.