# Tags

రోళ్ళ వాగు ప్రాజెక్టును రాష్ట్ర అటవీ శాఖ అధికారులు, ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

రోళ్ళ వాగు ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్య అటవీ శాఖ అధికారులు (పీసీసీఎఫ్) సువర్ణ IFS,శర్వానంద IFS తో కలిసి జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ సందర్శించారు.

రోళ్ల వాగు ప్రాజెక్టు అటవీశాఖ అనుమతుల కోసం హైదరాబాదులో పిసిసిఎఫ్ అధికారులను ఎమ్మెల్యే కలిసి ప్రాజెక్టు గేట్లు బిగించాలని వినతిపత్రాన్ని అందజేశారు….

దీంతో స్పందించిన అధికారులు వెంటనే రోళ్ల వాగు ప్రాజెక్టును సందర్శించడం అభినందనీయమని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు.

రోళ్లవాగు ప్రాజెక్టును సందర్శించిన అధికారులు అటవీ శాఖ అనుమతులు మాత్రమే కాకుండా పర్యావరణ అనుమతులు తప్పనిసరి అని తెలియజేశారు.

కవ్వాల్ ఫారెస్ట్ దగ్గరగా ఉన్న రోళ్ల వాగు ప్రాజెక్టులో 800 ఎకరాలకు పైగా అడవి ప్రాంతం ముంపునకు గురవుతున్న సందర్భంగా ఢిల్లీలో ఉన్న అటవీశాఖ కార్యాలయం నుండి అనుమతి తప్పనిసరి అని అధికారులు తెలిపారని, గతంలోనే నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ను కలవడం జరిగిందని వివరించారు.

ఇందుకు వారు కూడా సానుకూలంగా స్పందించి ఢిల్లీలో అటవీ పర్యావరణ శాఖ అనుమతులు వచ్చే విధంగా కృషి చేస్తానని తెలియజేయడం జరిగిందని అన్నారు. ప్రాజెక్టు గేట్ల బిగింపునను తనవంతుగా నిరంతరం కృషి చేస్తున్నానని,అధికారులు, ఎంపీ సహకారంతో గేట్ల బిగింపు చేస్తానని, బీర్పూర్ మండల ప్రజల మద్దతు కూడా ఉండాలని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో DFO రవి ప్రసాద్, ఇరిగేషన్ అధికారులు నారాయణరెడ్డి చక్రు నాయక్, నాయకులు నరేందర్ ప్రభాకర్ హరీష్ రైతులు తదితరులు పాల్గొన్నారు