# Tags
#తెలంగాణ #జగిత్యాల

విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం : జిల్లా కలెక్టర్  సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల :

పోలీస్ అమరుల త్యాగాన్ని స్మరిస్తూ నివాళులు, ఆయన కుటుంబ సభ్యులకు పరామర్శ

విధి నిర్వహణలో, దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం పోలీస్ ఫ్లాగ్ డే ను మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపం వద్ద జిల్లా కలెక్టర్, ఎస్పీ, పోలీస్ అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు.

అనంతరం సాయుధ పోలీసులు”శోక్ శ్రస్త్” చేసి మరణించిన పోలీసు అమరవీరులకు జిల్లా కలెక్టర్, ఎస్పీ  మరియు పోలీసు అధికారులు, సిబ్బంది…అమరవీరుల కుటుంబ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించి పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఈ సమాజం కోరుకునేది శాంతి, స్థిరత్వం,అభివృద్ధి.పోలీస్ శాఖ వారి త్యాగాల ద్వారా ఎన్నో దశాబ్దాలుగా సమాజం లో ప్రతి ఒక్కరికి రక్షణ కల్పిస్తూ , సామాజిక రుగ్మతలను పారద్రోలడం వరకు పోలీసు వ్యవస్థ ఎల్లప్పుడూకార్యదీక్షతో ,సేవాతత్పరత తో పని చేస్తుందన్నారు.

విధి నిర్వహణలో ప్రాణాలర్పించి అమరవీరులైన పోలీసుల త్యాగాలు వెల కట్టలేనివి వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రభుత్వం క్రమం తప్పకుండా ప్రతి ఏటా అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణార్థం పోలీస్ ఫ్లాగ్ డే ను ఘనంగా నిర్వహిస్తోంది.

అమర వీరులు అయిన పోలీసుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 31వ వరకు సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.

ఈ కార్యక్రమానికి హాజరైన పోలీస్ అమరవీరుల కుటుంబాల సభ్యులతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థుతులు వారి వారి సమస్యలను అడిగి, వారు చెప్పిన సమస్యలను సాద్యమైనoత తొందరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డిఎస్పి లు వెంకటరమణ, వెంకటరమణ, రఘు చంధర్, రాములు , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు లు కిరణ్ కుమార్ ,వేణు, సైదులు మరియు సి.ఐ లు ఎస్.ఐ లు, పోలీస్ అమర వీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

రాష్ట్ర డిజిపి గారి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న అన్ని పోలీసు స్టేషన్ల లో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు, కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.ఇందులో భాగంగా ఈరోజు నుండి 31 తేదీ వరకు రక్తదాన శిబిరాలు,సైకిల్ ర్యాలీ,క్యాండిల్ ర్యాలీ,2k రన్,ఓపెన్ హౌస్, వ్యాసరచన పోటీలు,ఫోటో,వీడియో పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ.. . పోలీసు అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. ప్రజావసరాల కోసం, సంరక్షణ కోసం ఏర్పడ్డ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అన్నారు.శాంతిభద్రతల పరిరక్షణ తో పాటు దేశ అంతర్గత భద్రత ప్రజల రక్షణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఇలా ప్రతి సందర్భాల్లోనూ పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పని చేస్తుందన్నారు. శాంతిభద్రతలు సక్రమంగా ఉంటే మారుమూల గ్రామాలకు కూడా అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ తెలిపారు.

అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 31 వరకు ప్రజలకు పోలీసులు మరింత చేరువయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారని , ఇది అభినందనీయమని అన్నారు. విధి నిర్వహణలో అమరులైనటువంటి వారికి వారి కుటుంబ సభ్యులకు సహాయ సహకారాలు అందిస్తూనే వారికి ఎల్లప్పుడూ సపోర్టుగా పోలీస్ ఆఫీసర్స్, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు.