# Tags
#తెలంగాణ #హైదరాబాద్

కేంద్ర విశ్వవిద్యాలయ భూముల అమ్మకాన్ని వెంటనే ఆపాలి:JNTUH విద్యార్థి సంఘాల నేత, తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఎరవెల్లి జగన్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, కేంద్ర విశ్వవిద్యాలయానికి సంబంధించిన 400 ఎకరాల భూమి అమ్మకాన్ని వెంటనే ఆపాలని JNTUH యూనివర్సిటీ విద్యార్థి నేత ఎరవెల్లి జగన్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

ప్రజల ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీ భూములను విద్యార్థుల అవసరాలకు, భవిష్యత్ కి కృషి చేయాలి కానీ, కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని చేస్తున్న ప్రయత్నం ను విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వంను డిమాండ్ చేశారు.

విశ్వ విద్యాలయం భూముల వేలం ఆపాలని పోరాటం చేస్తున్న విద్యార్థి సంఘాల విద్యార్థుల అరెస్ట్ లను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

వృక్ష సంపాదను కాపాడాలని, HCU లో అర్థరాత్రి కూడా బుల్డజర్లతో చెట్లను కూల్చడం వల్ల అక్కడి నెమల్ల ఆర్తనాదాలు హృదయపూర్వకంగా ఉన్నాయన్నారు.
పర్యావరణ విధ్వంసంను వెంటనే అపి, HCU అటవీ సంపాదను, జీవవైవిద్యాన్ని కాపాడాలని అయన రాష్ట్ర ప్రభుత్వంను డిమాండ్ చేశారు.

HCU భూములను వేలం ఆపకపోతే భారత దేశ వ్యాప్తంగా అన్ని విశ్వ విద్యాలయాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని జగన్ తన ప్రకటనలో హెచ్చరించారు.