# Tags
#తెలంగాణ #జగిత్యాల

జగిత్యాల జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం, 78.34 శాతం పోలింగ్

జగిత్యాల జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతం, 78.34 శాతం పోలింగ్ : కలెక్టర్, ఎన్నికల అధికారి సత్యప్రసాద్

జగిత్యాల జిల్లాలో జరిగిన రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆదివారం ఉదయం 7 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రశాంతంగా ముగిసింది. 

జగిత్యాల అర్బన్, జగిత్యాల రూరల్, సారంగాపూర్ , రాయికల్ , బీర్పూర్, మల్యాల, కొడిమ్యాల మండలాల్లోని  144 గ్రామ పంచాయతీలు, 1276 వార్డులకు నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి సత్యప్రసాద్ తో పాటు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అవసరమైన అన్ని చర్యలు తీసుకొని ఏర్పాట్లు గావించారు.

ఎన్నికల నిర్వహణకు రెండో విడతలో  1531 పిఓలు, 2044 మంది ఓపివోలు  ఎన్నికల విధులు నిర్వహించారని వివరించారు.

జిల్లా కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ లు బి ఎస్ లత రాజా గౌడ్,  జడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి, నోడల్ అధికారులు డాక్టర్ బి నరేష్, పి. నరేష్ తో పాటు జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్, మదన్మోహన్, రేవంత్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కన్నం హరిని  మరియు ఇతర అధికారులు ఆదివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జిల్లాలోని జగిత్యాల నియోజకవర్గం లోని ఐదు మండలాలు చొప్పదండి నియోజకవర్గం లోని రెండు మండలాలు పరిధిలో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలను తీసుకుంటూ పోలింగ్ అధికారులకు సిబ్బందికి తన సూచనలు గావించారు. 

శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ఎస్బి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఇతర పోలీస్ అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులకు సిబ్బంది కి పలు సూచన చేశారు.

మొత్తానికి జగిత్యాల జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ రెండవ విడత ప్రశాంతంగా 78.34 తో ముగిసింది ఇదిలా ఉండగా మధ్యాహ్నం రెండు గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తికావించి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు