# Tags
#తెలంగాణ #Events

అగ్నిమాపకశాఖ సిబ్బంది సేవలు అభినందనీయం : ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు

రంగారెడ్డి జిల్లా, వట్టినాగులపల్లి :

ఎక్కడ విపత్తు తలెత్తినా మేమున్నామంటూ రంగంలోకి దిగి ప్రజల ప్రాణాలను కాపాడుతూ,ఒక  అన్నగా.. పెద్దన్నగా నిలుస్తున్నారని, అగ్నిమాపకశాఖ సిబ్బంది సేవలు అభినందనీయం అని ఐటీ,పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు ప్రశంసించారు. 

రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని ‘టీజీ ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్సిట్యూట్ ’లో శనివారం జరిగిన 196 మంది డ్రైవర్ ఆపరేటర్ల పాసింగ్ ఔట్ పరేడ్ కు మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

అగ్నిమాపక శాఖ సిబ్బంది సేవలు అభినందనీయం అనీ, ముఖ్యంగా ఖమ్మంలో వరదలు తలెత్తినప్పుడు వీరు కీలకంగా వ్యవహరించారని కొనియాడారు. ఏడాది వ్యవధిలోనే అగ్నిమాపక శాఖకు సంబంధించిన విభాగాల్లో 878 మందిని రిక్రూట్ చేశామన్నారు. రాబోయే రోజుల్లో ఈ శాఖను మరింత బలోపేతం చేస్తామనీ, అగ్నిమాపక శాఖ సిబ్బందిపై గురుతర బాధ్యత ఉందన్నారు. విపత్తులు తలెత్తినప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మరింత  ముందుండాలని అన్నారు.

4 నెలల కఠోర శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన 196 మంది డ్రైవర్ ఆపరేటర్లకు అభినందనలు చెపుతూ,  ఉద్యోగాల్లో చేరిన తర్వాత నీతి, నిజాయితీగా వ్యవహరించాలని హితావు పలికారు. మీ మీ విధులను సమర్థవంతంగా నిర్వహించాలనీ, ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ దయానంద్, హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా, ఫైర్ డీజీ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అగ్నిమాపకశాఖ సిబ్బంది సేవలు అభినందనీయం : ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు

JAGTIAL NEWS 03-01-2025