#తెలంగాణ

మెగా లోక్ అదాలత్ సేవలను వినియోగించుకోవాలి

-గొడవలు వద్దు-రాజీలే ముద్దు : ఎస్.ఐ ఎల్లారెడ్డిపేట
-నేటి నుండి 28వ తారీకు వరకు
ఎల్లారెడ్డిపేట,sampath p:
రాజీ పడదగిన కేసులో ఉన్నవారు రాజమార్గం ద్వారానే పరిష్కరించుకోవడమే మంచిదని, దీని ద్వారా సమయం వృధా కాదని కక్షలు,కారుణ్యాలు తగ్గుతాయని తద్వారా స్నేహభావం పెంపొందుతుందని ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ తెలిపారు. మీ ఉచిత న్యాయ సేవ అధికార సంస్థ తేదీ 23-09-2024 నుండి 28-09-2024 వ తారీకు వరకు సిరిసిల్ల జిల్లా కోర్టులో *మెగా లోక్ అదాలత్* ఉందని అన్నారు. ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మీపై కానీ, మీకు తెలిసిన వాళ్లపై గాని ఏమైనా కేసులు ఉంటే వాటిని పూర్తి పరిష్కారం (రాజీ) చేసుకుని కోర్టుకు హాజరైనట్లయితే ఆ కేసులను పూర్తిగా మూసి వేయడం జరుగుతుందని ఎస్సై తెలిపారు. గొడవ పడిన, ప్రమాదాలు జరిగిన, చీటింగ్ కు , వివాహ లకు సంబంధించిన, చిన్న చిన్న దొంగతనాలు, మరియు ఇతర రాజీ పడ దగ్గు కేసులు , ఈ మెగా లోక్ అదాలత్ లో కాంప్రమైజ్ చేసుకుని క్లోజ్ చేసుకునే అవకాశం ఉందని, కాబట్టి ఈ అవకాశాన్ని కేసు ఉన్నట్టు వంటి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. దీన్ని కోసం ఫిర్యాదుదారుడు మరియు నేరస్తుడు (రాజీ పడినవారు) తమ యొక్క ఆధార్ కార్డు తీసుకుని సిరిసిల్ల కోర్టుకు రాగలరని తెలిపారు.పూర్తి సమాచారం కోసం :87126 56374, ఎస్సై ఎల్లారెడ్డిపేట,కోర్టు కానిస్టేబుల్ : 9052034397, శ్రీనివాస్ గౌడ్ 8712537735 పై నెంబర్లకు సంప్రదించగలరని ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *