# Tags
#తెలంగాణ

ఘనంగా ముగిసిన మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవాసమితి వారి శ్రీ శారదాచంద్రమౌళీశ్వర రుద్ర సేవాపరిషత్ నిర్వహణలో రుద్ర సహిత శతచండీ యాగము

హైదరాబాద్ :

ఓం శ్రీమాత్రేనమః శ్రీ శారదా చంద్రమౌళీశ్వరాభ్యాం నమః

మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవాసమితి (MBBS) వారి 
శ్రీ శారదాచంద్రమౌళీశ్వర రుద్ర సేవాపరిషత్ నిర్వహణలో గత 5 రోజులుగా హైదరాబాద్ మల్లాపూర్ వి ఎన్ ఆర్ గార్డెన్స్ లో వైభవంగా, వేదోక్తంగా శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహా స్వామి వారి దివ్య ఆశీస్సులతో…


శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతి స్వామి వారి అనుగ్రహములతో…
శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతీ స్వామివారి దివ్య ఆశీస్సులతో…గణపతి, మహాలక్ష్మి, సుదర్శన, అరుణ, రుద్ర సహిత శతచండీ యాగము స్వామి వారల కల్యాణమహోత్సవంతో ఘనంగా ముగిసింది..

గత 02వ తేదీ, బుధవారమునుండి ప్రారంభమైన 
పూజా కార్యక్రమాలు….శ్రీ శివపార్వతుల, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కల్యాణకార్యక్రమంతో  ఘనంగా ముగిశాయి.

5 రోజులపాటు ఉదయం 8 గం॥ లకు గురుప్రార్ధన, స్థాపిత దేవతా ప్రాతఃకాల పూజలు, చండీపారాయణములు, మహాన్యాస పూర్వక వర పాశుపత ఏకాదశ రుద్రాభిషేకము, మూలమంత్ర అనుష్ఠానములు, . శ్రీ లలితా సహస్రనామ కుంకుమార్చన, దుర్గా, లక్ష్మి సరస్వతీ హోమములు నిర్వహించారు.ఇక, సాయంత్రం 5 గం॥ లకు ప్రదోషకాల పూజ, రాజోపచారములు, క్రమార్చన, మంగళనీరాజనం, మంత్రపుష్పము, నామ సంకీర్తన, తీర్ధప్రసాద వినియోగం గావించారు.

మహిళలు మెహెందీ కార్యక్రమం ధర్మపురికి చెందిన గాయకుడు మధు బాపుశాస్త్రి గానలహరి నిర్వహించారు.

చివరి రోజు 06 వ తేదిన ఆషాఢ శుద్ధ ఏకాదశి,హిందువుల తొలి పండుగ్గుగా భావించే తొలి ఏకాదశి ఆదివారము రోజున ఉదయం: 8 గం||లకు గురుప్రార్ధన. స్థాపిత దేవతా ప్రాతఃకాల పూజలు, మహాన్యాస పూర్వక సంతాన పాశుపత రుద్రాభిషేకము, మూలమంత్ర అనుష్ఠానములు, శతచండీయాగము, శాంతి, పౌష్టిక హోమములు, బలిప్రదానము, “మహాపూర్ణాహుతి” కలశోద్వాసనము, అవబృధము, తీర్ధప్రసాద వినియోగం, శాంతి కళ్యాణము, ఋత్విక్ సన్మానం, మహదాశీర్వచనము నిర్వహించారు.

ఈ సందర్బంగా “మహాపూర్ణాహుతి” కలశోద్వాసనము
అనంతరం  శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతీ స్వామివారు అనుగ్రభాషణంతో మంగళాశాసనములందించారు. సంస్కారవంతులుగా పిల్లలను తీర్చిదిద్దాలని తల్లితండ్రులకు సూచించారు. అలాగే మనిషి తన జీవన విధానంలో తల్లితండ్రులను, అత్తమామలను, విద్యానేర్పిన గురువులను, ఆపదలో సాయం చేసినవారిని ఎప్పుడూ విస్మరించరాదని హితవు పలికారు.  

చివరగా ముగింపు కార్యక్రమంలో పలువురు బ్రాహ్మణ పెద్దలు పాల్గొని స్వామివారల మహదాశీర్వచనము తీసుకున్నారు.5 రోజులపాటు మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవాసమితి (MBBS) వారి శ్రీ శారదాచంద్రమౌళీశ్వర రుద్ర సేవాపరిషత్ నిర్వహణలో గత 5 రోజులుగా హైదరాబాద్ మల్లాపూర్ వి ఎన్ ఆర్ గార్డెన్స్ లో వైభవంగా, వేదోక్తంగా నిర్వహించడంలో కృషి చేసిన సంఘాసభ్యులకు, సహకరించిన దాతలకు శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతీ స్వామివారు మంగళాశాసనములందించి,

ఎలాంటి విభేదాలు లేకుండా, సంఘటితంగా వచ్చే సంవత్సరం కూడా మరింత వైభవంగా నిర్వహించాలని,  లోక కళ్యాణం కోసం చేస్తున్న గణపతి, మహాలక్ష్మి, సుదర్శన, అరుణ, రుద్ర సహిత శతచండీ యాగము స్వామి వారల కల్యాణమహోత్సవం సత్ఫలితాలు ఇవ్వాలని అనుగ్రహభాషణం చేశారు.