# Tags

పుట్టి పెరిగిన పల్లె ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో గొప్పనైనది: ఆర్డిఓ కే.మహేశ్వర్

పుట్టి పెరిగిన పల్లె ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో గొప్పనైనదని కరీంనగర్ ఆర్డిఓ కే మహేశ్వర్ అన్నారు.

శనివారం సమైక్య సాహితీ ఆధ్వర్యంలో కోట్ల నరసింహులపల్లిలో జరిగిన ‘వేణుశ్రీ’ రెండు పుస్తకాలు ‘నాయక శతకం’ మరియు ‘నేను నా పల్లె’ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

కోట్ల నరసింహుల పల్లె ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశమని ఇలాంటి చక్కని పరిసరాల్లో ఈ పుస్తకాల ఆవిష్కరణ జరగడం సంతోషంగా ఉందన్నారు. సాహిత్యం మనిషిని మంచి వైపు నడిపిస్తుందని పేర్కొన్నారు. కరీంనగర్ ప్రాంతంలో అనేకమంది రచయితలు సాహితీ సృజన చేయడం అభినందనీయమన్నారు.

విశిష్ట అతిథిగా హాజరైన గండ్ర లక్ష్మణరావు మాట్లాడుతూ వేణుశ్రీ అలతి పదాలతోనే సమాజంలో ఉన్న అవినీతిని ఎండగట్టాడని పేర్కొన్నారు. పుట్టిన ఊరు మీద ప్రతి ఒక్కరికి మమకారం ఉంటుందని వేణు శ్రీ తన ఊరు గురించి రాసిన పుస్తకాన్ని తన ఊరిలోనే ఆవిష్కరించుకోవడం చాలా గొప్ప విషయం అన్నారు.

మాడిశెట్టి గోపాల్ సభ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో కూకట్ల తిరుపతి ‘నాయక శతకాన్ని’ స్తంభం కాడి గంగాధర్ ‘నేను నా పల్లె’ పుస్తకాన్ని సమీక్షించారు.

నాయక శతకాన్ని నరసింహస్వామికి అంకితనీయగా నేను నా పల్లె పుస్తకాన్ని రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రామ వాస్తవ్యుడు సాయిలు కు అంకితం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కవితలు శర్మ సిహెచ్ రమణాచారి బివిఎన్ స్వామి ప్రమోద్ కుమార్ అనంత ఆచార్య గజేందర్ రెడ్డి తాండూరు వెంకటేశ్వర్లు నీలగిరి అనిత గంగుల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. సంస్థ పక్షాన రచయిత వేణు శ్రీని ఆశీస్సులను ఘనంగా సన్మానించారు.