# Tags
#తెలంగాణ

ప్రజల ఆశీస్సులతో ప్రజా సంక్షేమపథకాల అమలులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు :మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం మా ధ్యేయం

-ప్రజల ఆశీస్సులతో ప్రజా సంక్షేమపథకాల అమలులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ధర్మపురి, జగిత్యాల జిల్లా :

ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజా సంక్షేమపథకాల అమలులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతుంటే ప్రతిపక్షాలు ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్నాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయన్నారు.

ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడిన్నామన్నారు. దశబ్ద కాలం పాలించిన వారు రాష్ట్ర ఖాజానాకు చిల్లులు పొడిస్తే, వాటిని ఒక్కొక్కటీ పూడుస్తూ, అభివృద్ధి దిశ వైపు వెళ్తున్నామన్నారు. రైతులు పందించిన దాన్యం కు మద్దతు ధర కల్పిస్తూ, సన్న రకాలకు 500 రూ. అదనంగా బోనస్ ఇస్తుంటే కూడా, ప్రభుత్వాన్ని విమర్శించడమే ధ్యేయంగా brs నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

రాబోయే 4 సంవత్సరాలలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం మా ధ్యేయంగా ముందుకు వెళతామని స్పష్టం చేశారు.