# Tags
#తెలంగాణ

వాళ్లు మూగజీవాల దేవుళ్ళు వారు…. వైద్యో నారాయణో హరి

కరీంనగర్ : (ముడికే కనకయ్య) :

వైద్యులు కేవలం నోరున్న మనుషులకే కాదు నోరులేని మూగజీవాలకు సైతం వైద్యం చేస్తూ, నయం చేస్తున్న డాక్టర్లు మాటలున్న మనుషులకు, మాటలు రాని మూగజీవాలకు సైతం వారు దేవుళ్లే అని చెబుతూ వారిని వైద్యో నారాయణో హరిః అని పోల్చక తప్పదు.

కరీంనగర్ జిల్లా పశు వైద్యశాల సీనియర్ డాక్టర్ ఎం రామస్వామితో పాటుగా ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న మరో పశు వైద్యుడు డాక్టర్ కుంబోజు రమేష్ లు నిత్యం తాము విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ దవాఖానకు వచ్చే మూగ జీవాలకు వైద్యం చేస్తూ, అంకితభావంతో పనిచేస్తున్న వారు నిజంగా మూగజీవాల పాలిట దేవుళ్ళే అని చెప్పవచ్చు.

ఇందుకు నిదర్శనం, ఒక జంతువు ప్రేమికుని ద్వారా ప్రమాదంలో గాయపడ్డ ఓ కోతి విషయం తెలుసుకున్న ఆ పశు వైద్యులు కోతికీ సరైన చికిత్స చేసి ఐదు రోజులు దవాఖానలో ఉంచుకొని పూర్తిగా కోలుకున్న తర్వాత బయటకి వదిలిపెట్టి, తమ మానవత్వం చాట్టడమే కాకుండా, తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించారు.

అంతేకాకుండా ఓ రైతుకు చెందిన ఒక పాడి ఆవుకు గర్భంలోనే లేగ దూడ మృతి చెందడంతో ఆవుకు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా లేక దూడను ఆపరేషన్ ద్వారా బయటకు తీశారు.. 

వయసు పైబడిన వివిధ రకాల మూగజీవాలకు నడవలేని పరిస్థితిలో ఉన్నట్లయితే వాటిని గుర్తించి మోకాళ్ళకు శస్త్ర చికిత్స చేస్తున్నారు.

మనుషులకు ఏమైనా అవస్థ అయితే చెప్తూ ఉంటారు, కానీ మూగ జీవాల అవస్థలను, వ్యాధులను గుర్తించి వైద్యం చేస్తున్న పశు వైద్యులు డాక్టర్లు ఎం రామస్వామి,  కే రమేష్ లను మూగజీవాలకూ దేవుళ్ళని జంతువుల యజమానులు కొనియాడుతున్నారు. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *