# Tags
#తెలంగాణ

విజ్ఙులుగా ఆలోచించండి. మీ బిడ్డనైన నన్ను ఆశ్వీరదించండి:ఓ సాధారణ రైతు భూక్యా నందు

రాజకీయ, ఆర్దిక లబ్ధి కోసం పార్టీలు మారే నాయకులను చూసాం..కానీ మన తలరాతలు మార్చే నాయకులు మచ్చుకైనా కనిపించరు…

మళ్ళీ మళ్లీ వారికే పట్టం కట్టి మన జీవితాలను… మన భవిష్యత్ తరాల వారికి అంధకారాన్ని మిగల్చకండి… విజ్ఙులుగా ఆలోచించండి. మీ బిడ్డనైన నన్ను ఆశ్వీరదించండి……అంటూ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం వడ్డె లింగాపూర్ గ్రామంకు చెందిన ఓ సాధారణ రైతు భూక్యా నందు ఈ లోక్ సభ ఎన్నికలలో పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా విద్యార్థుల రాజకీయ పార్టీ నుండి పోటీ చేస్తున్నాడు.

గత అసెంబ్లీ ఎన్నికలలో సైతం పోటీ చేసి, ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలలో కూడా సై అంటూ…ఎన్నికల రంగంలో దిగాడు. ఒక పవిత్రమైన సంకల్పంతో, సమాజంలో మార్పుకోసం విద్యార్థుల రాజకీయ పార్టీ నుండి ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని, ఆ సంకల్ప బలమే నన్ను నడిపిస్తుందంటున్న భూక్యా నందు గెలుపు, ఓటముల గురించి ఆలోచించడం లేదనీ, మార్పు ఎక్కడో ఒక చోట మొదలవుతుందనీ, ఆ మార్పు తనతోనే ప్రారంభం అవుతుందన్న నమ్మకమే ప్రజల ముందుకు తీసుకువెళుతుందంటున్నారు.

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకున్న ఏకైక నమ్మకం, విశ్వాసంకు నిదర్శనమే ఎన్నికల ప్రక్రియ అని అంటున్నారు. అర్హతగల ప్రతీ ఓటరూ తమ ఓటు హక్కును బాధ్యతగా భావిస్తూ, మే 13న జరగనున్న ఎన్నికలలో విధిగా పాల్గొని ఓటు వేయాలనీ, ఓటు వేయడంలో నిర్లక్ష్యం, నిర్లిప్తత ప్రజాస్వామ్యం కు మంచిది కాదంటూ, ప్రతీ ఒక్కరూ మీ అమూల్యమైన ఓటు వేయాలని కోరుతున్నారు.