# Tags

తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దైవదర్శనం కోసం 116 మంది చాకుంట విద్యార్థులకు సహకరించిన ఆత్మీయులకు సత్కారం

కరీంనగర్ :

తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దైవదర్శనం కోసం 116 మంది చాకుంట విద్యార్థులను, ఉపాధ్యాయ బృందమును ఇతర సిబ్బందితోపాటు తల్లిదండ్రులను మరియు తమ కుటుంబ సభ్యులను తిరుమల తిరుపతి దైవ దర్శనం పంపించడానికి గాను సహకరించిన అలనాటి ధన్గర్ వాడి పాఠశాల పూర్వ విద్యార్థులుగా పాఠశాల పునర్నిర్మానంతో పాటు ముందుండి నడిపించిన ప్రముఖులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు

 మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, ప్రముఖ గ్రానైట్ వ్యాపారవేత్త తిరుపతి గౌడ్, మాజీ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్,

న్యాయవాది సాయిరాం,  (మున్నా) , వ్యాపారవేత్త పోల్సాని రవీందర్రావు, పసుర పెస్టిసైడ్స్ ప్రైవేట్ లి.హైదరాబాద్ కు చెందిన మహేందర్ రావు,

కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి (సుడా చైర్మన్), ప్రవీణ్ రావు (నందా ఫుడ్స్), ఆకారపు భాస్కర్ రెడ్డి, చెన్నమనేని శ్రీనివాసరావు (బిల్డర్, హైదరాబాద్) రాజేందర్రావు, మాజీ కార్పొరేటర్ రామ్మోహన్ రావు తదితరులు ఎందరో ఉన్నారు. 

అప్పటినుండి ఇప్పటివరకు తాను ఏ పాఠశాలలో పనిచేసినా,  వాటి అభివృద్ధిలో ఉన్న వెంట నడిపిస్తున్న వీరిని సత్కరించడం తన బాధ్యత అని చాకుంట ప్రధానోపాధ్యాయుడు కలికోట తిరుమల్ అంటున్నారు. 

ఈ సందర్భంలో,  సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో వారిని కలిసి, శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ప్రతిమను అందించిన  కలికోట తిరుమల్ కృతజ్ఞతలు చెపుతూ, శాలువాతో సత్కరించారు.