# Tags

దరూర్ క్యాంపు బాలుర వసతి గృహం సమీపంలో ప్రమాదవశాత్తు పేలిన ట్రాన్స్ఫార్మర్ – ఒక విద్యార్థికి స్వల్ప గాయాలు, తప్పిన ప్రాణాపాయం

జగిత్యాల :

-వెంటనే స్పందించిన అధికారులు, సిబ్బంది 

గురువారం రాత్రి జగిత్యాల దరూర్ క్యాంపు బాలుర వసతి గృహం సమీపంలో ఉన్న ఒక ట్రాన్స్ఫార్మర్ అకస్మాత్తు గా పేలి విద్యుత్ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో హిమేష్ అనే 8వ తరగతి విద్యార్ధి సాయంత్రం ఉతికి ఆరేసిన బట్టలు తెచ్చుకోవడానికి డాబా పైకి వెళ్లాడు.

అదే సమయంలో వసతి గృహం బయట ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ ఆకస్మాత్తుగా పేలి, కొన్ని నిప్పు రవ్వలు ఆ విద్యార్థి పైన పడడం వల్ల స్వల్ప గాయాలు అయ్యాయి.

వెంటనే హాస్టల్ సిబ్బంది స్పందించి, హాస్పిటల్ తీసుకెళ్ళి చికిత్స అందించారు.బాలునికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారని జిల్లా ఎస్టీ సంక్షేమశాఖ అధికారి రాజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

కాగా ఘటన జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాలమేరకు అదనపు కలెక్టర్ శ్రీమతి బి ఎస్ లత తోపాటుగా, ఆర్డీఓ మధుసూదన్, ట్రాన్స్ కో ఏ డి ఈ జవహర్లాల్ నాయక్, ఇతర అధికారులు పరిశీలించారని తెలిపారు .

పరిస్థితిని సమీక్షించారని… . ఆసుపత్రిలో వైద్యులతో మాట్లాడారని, బాలుడు కోలుకున్నాడని రాజ్ కుమార్ తెలిపారు. 

దరూర్ క్యాంపు బాలుర వసతి గృహం సమీపంలో ప్రమాదవశాత్తు పేలిన ట్రాన్స్ఫార్మర్ – ఒక విద్యార్థికి స్వల్ప గాయాలు, తప్పిన ప్రాణాపాయం

PolicecommemorationDay 2025