# Tags

జిల్లా సమీకృత కలెక్టరేట్ లో ప్రజాకవి కాళోజి జయంతి, కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు

జగిత్యాల :

మంగళవారం జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో ప్రజాకవి, పద్మవిభూషణ్,స్వాతంత్ర్య సమర యోధుడు, సామాజిక కార్యకర్త కాళోజీ నారాయణ రావు జయంతి కార్యక్రమం  నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తో పాటుగా పలువురు జిల్లా అధికారులు పాల్గొని, కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ప్రజాకవి కాళోజీ  సేవలు, తెలంగాణ ఉద్యమానికి చేసిన కృషి, అయన రచనలు తెలంగాణ సంస్కృతి, స్వేచ్ఛ, సమానత్వాన్ని ప్రతిబింభించాయని తెలిపారు.  తెలుగు భాషా మాధుర్యం, సంపద, సంస్కృతి కలిగిన భాష అని కలెక్టర్ సత్యప్రసాద్ గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కాళోజి జయంతి సందర్బంగా ప్రతియేట సెప్టెంబర్ 9న తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకుని, రాష్ట్రానికి చెందిన సాంస్కృతిక కళాకారులను గుర్తించి ప్రభుత్వం పురస్కారాలు అందిస్తుందని తెలిపారు.”అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు, సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా ” అని అన్నారు కాళోజి. తెలుగు భాషపై అమితమైన ప్రేమను కలిగినటువంటి కాళోజి ఆశయాలను కొనసాగించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బి.సి వెల్ఫేర్ అధికారిణి జి.సునీత, జిల్లా గ్రామీనాభివృద్ధి శాఖ అధికారి రఘువరన్, డిపివో మదన్మోహన్ తో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.