# Tags
#అంతర్జాతీయం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, అజాత శత్రువు, స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు 25వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, అజాత శత్రువు, స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు 25వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, అజాత శత్రువు, స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు 25వ వర్ధంతి సందర్భంగా, శనివారం మంథని నియోజకవర్గ కేంద్రంలో ఆయన కుమారుడు, రాష్ట్ర ఐటి,పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శ్రీపాద ట్రస్ట్ ఛైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు  ఘనంగా నివాళులర్పించారు.

మంత్రి శ్రీధర్ బాబుతో పాటుగా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్థి గడ్డం వంశీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, న్యాయవాది శశిభూషణ్ కాచె తదితరులు పాల్గొని స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు నిలువెత్తు చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….మంథని నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసి,ప్రజల హృదయాల్లో నిలిచిన చిరస్మరణీయులు, అజాత శత్రువు శ్రీపాదరావు అని కొనియాడారు. శ్రీపాదరావు ఆశలు, ఆశయాలు పేద ప్రజల సంక్షేమం కోసమేననీ…ఆయన చూపిన మార్గదర్శకం అమోఘమైనదన్నారు.