# Tags
#తెలంగాణ

క్షయ వ్యాధి పట్ల అవగాహన సదస్సు…

(తెలంగాణ రిపోర్టర్):-

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గ్రామం ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎల్లారెడ్డిపేట లో క్షయ వ్యాధి అవగాహన పై టి.బి ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాం,ఉచిత సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది.

మండల ప్రాధమిక ఆరోగ్యకేంద్ర వైద్యాధికారి డా. సారియా అంజూమ్ ఆధ్వర్యంలో టి.బి ముక్త్ భారత్ అభియాన్ ఎల్లారెడ్డిపేట ఉప ఆరోగ్యకేంద్రలో నిర్వహించారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టి.బి సూపర్వైసర్ మహిపాల్ మాట్లాడుతూ ఇందులో షుగర్, క్యాన్సర్, బీపీ,
దీర్ఘకాలిక వ్యాధులు, పొగాకు తీసుకునే వారిలో క్షయ వ్యాధికి గురయ్యే అవకాశం ఎక్కువ గా ఉన్నాయని, క్షయ లక్షణాలు ..రెండు వారాలు మించి దగ్గు,జ్వరం, ఆకలి లేకపోవడం, రాత్రిపూట చెమటలు పట్టడం, బరువు తగ్గడం ..వున్న వారు తేమడ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు, టి.బి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం లో 146 మంది పైగా టిబి స్క్రీనింగ్ చేశామని 18 మంది అనుమానితుల నుండి తేమడ నమూనాలను సేకరించి ల్యాబ్ కి పంపించమన్నారు. 15 మంది సింటమేటిక్ వాళ్ళని X-Ray కి సిరిసిల్ల మెడికల్ కాలేజ్ రేడియాలజీ ల్యాబ్ కి రెఫర్ చేసామని అందులో క్షయ వ్యాధి నిర్ధారణ అయిన వారికి 6 నెలల పాటు పూర్తి ఉచితంగా పరీక్షలు, మందులు ఇస్తామన్నారు.అలాగే నిక్ష్యయ్ పోషన్ ద్వారా వ్యాధిగ్రస్తుతులకు నెలకి 1000/- రూ. పౌష్టికాహారం కోసం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లో డా. సారియా అంజూమ్ గారు , టి. బి. సూపర్వైజర్, G మహిపాల్ (STS), HS MLHP, ఏన్ఎంలు భూలక్ష్మి, అమృత మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు