# Tags
#తెలంగాణ #జగిత్యాల

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం : టీ.ఈ.జేఏసీ రాష్ర్ట చైర్మన్ మారం జగదీశ్వర్


జగిత్యాల సెప్టెంబర్ 27:
ఉద్యోగుల,ఉపాధ్యాయుల,పెన్షనర్ల, గెజిట్టెడ్ అధికారుల సమస్యలన్నీ పరిష్కారమవుతాయని టీ.జీ.ఈ.జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు.

శనివారం జిల్లా కేంద్రంలోని నీటి పారుదల శాఖ కార్యాలయ సమావేశ మందిరం లో టీజీఈజెఏసీ జిల్లా చైర్మన్ మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జె ఏ సీ భాగస్వామ్య సంఘాల జిల్లా బాద్యులు, జె ఏ సీ కార్యవర్గం తో కలిసి నిర్వహించిన సమావేశంలో టీ.జీ.ఈ.జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడారు.

కొద్ది రోజుల ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి సూచనల మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి నేత్రుత్వంలో ఏర్పాటు చేసిన సమావేశం లో ఉద్యోగుల,ఉపాధ్యాయుల, పెన్షనర్ల సమస్యలయిన ఈ.హెచ్.యస్ అమలు, పెండింగ్ డి.ఏ.లు, పీ.ఆర్.సీ, సీ.పి.ఎస్.రద్దు, పెండింగ్ బిల్లుల చెల్లింపుల మరియు వివిధ శాఖల సమస్యలపై చర్చలు జరిపామన్నారు.

ఎంప్లాయిస్ హెల్త్ స్కీం అమలుకు వెంటనే విధి విధానాలు రూపొందించాలని, సీ.పి.ఎస్.రద్దు కు ప్రభుత్వం మ్యానిఫెస్టో లో పొందు పరిచిన విధంగా వెంటనే కమిటీ వేయాలని, పెండింగ్ బిల్లుల మంజూరుకొరకు ప్రతి నెల 700 కోట్ల రూపాయలు విడుదల చేయాలనీ, తాము చర్చించిన ఇతర సమస్యలపై సానుకూలంగా స్పందించారని, రెండు నెలలలో మరొక డిఏ విడుదల అవుతుందని, ఇప్పటివరకు రూపాయలు 2000 కోట్లు పెండింగ్ బిల్లులు మంజూరు చేయటం జరిగిందని వివరించారు. ,

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు ఉత్తర్వులు ఇచ్చారని, 317 జీ ఓ బాధిత ఉద్యోగుల వెసులుబాటు కోసం డెప్యూటేషన్ సౌకర్యం కల్పించటం జరిగినదని, ఆర్ధిక వెసులుబాటును బట్టి ఒక్కొక్కటి గా సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు.

టీ.జి.ఉద్యోగ సంఘాల జేఏసీ ఎల్లప్పుడూ ప్రభుత్వం లో భాగస్వామ్యంగా ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ను అభివృద్ధి పథంలో అగ్రగామిగా చేయడానికి అహర్నిశలు కృషిచేస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో టీజీఈజేఏసీ జిల్లా డిప్యూటీ కన్వీనర్ లు అమరేందర్ రెడ్డి, మామిడి రమేష్, కో చైర్మన్ లు ఎం డి. వకీల్, తుంగూరి సురేష్, హరిఅశోక్ కుమార్, ఎల్లా గంగరాజం, శ్యామ్, సంతోష్ రెడ్డి, భూమేశ్వర్, అరుణ, రవీందర్, ప్రకాష్ రావు, జిల్లా నాయకులు విజేందర్, గంగనర్సయ్య, అశోక్ రాజు, అతికేం శ్రీనివాస్, మహమూద్, సాహెద్ బాబు, రవీందర్, హన్మంత రెడ్డి, విశ్వనాధం, సత్యం, రఘుపతి, అంజయ్య, శ్రీనివాస్ స్వామి, రాజేందర్, రాములు, రాజేశం, సుగుణాకర్, మమత, శైలజ, రాజశ్రీ, విజయలక్ష్మి, మధుకర్, ప్రమోద్, సునీత్, వెంకటపవన్, హకీమ్, సాయి కృష్ణ, నారాయణ, రాజేందర్, హసీరుద్దీన్, ఆనంద్, రాజకుమార్, సురేందర్ నాయక్, భాస్కర్, శ్రీకాంత్, శంకర్, మల్లయ్య, జనార్దన్, నగేష్, బైగ్, లష్మినారాయణ, సృజన, శంకరమ్మ, వివిధ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.