# Tags

యూరియా కొరత..కేంద్రందే బాధ్యత : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

రాయికల్ : ఎస్.శ్యామసుందర్ :


నాలుగు వంతెనల నిర్మాణం…నాకు సంతృప్తినిచ్చింది..!
…బోర్నపల్లి,కమ్మునూరు బ్రిడ్జిల నిర్మాణం దగ్గరుండి పర్యవేక్షించాను…
… పదేళ్ల తర్వాత రేషన్ కార్డులు, ఇండ్ల మంజూరు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

రామగుండం ఎరువుల కర్మాగారంలో 8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి కావలసి ఉండగా కేవలం 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి కావడంతో యూరియా కొరత ఏర్పడిందని దీనిపై కేంద్రందే బాధ్యత అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాయికల్ మండలంలోని బోర్నపల్లి బ్రిడ్జి వద్ద గోదావరి నీటి ఉధృతి పెరగడంతో గోదావరి తీర ప్రాంతాలను మంగళవారం పరిశీలించి ప్రజలు,అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రాయికల్ పట్టణంలో విలేఖరులతో మాజీ మంత్రి మాట్లాడుతూ… రైతులకు సకాలంలో ఎరువులు అందక ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్రంలో ఉన్న రామగుండం ఎరువుల కర్మాగారం నుండి ఉత్పత్తి అయ్యే యూరియా 90% తెలంగాణ రైతాంగానికి కేటాయించకపోవడం కేంద్ర మంత్రులు,బిజెపి ఎంపీల బాధ్యత రాహిత్యమని మండిపడ్డారు.

ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల మధ్య వాణిజ్య వ్యాపార, రవాణా సౌకర్యార్థం కడెం,రాయికల్ మండలాల మధ్యలో బోర్నపల్లి బ్రిడ్జి,కమ్మనూరు, కలమడుగు మధ్య బ్రిడ్జి నిర్మాణం, మల్లాపూర్ మండల్ బాదనకుర్తి బ్రిడ్జి,నిజాంబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గుమ్మిరియాల గోదావరి నదిపై ఈ నాలుగు వంతెనల నిర్మాణంలో నాకు భాగస్వామ్యం ఉండడం నా జీవితంలో అత్యంత తృప్తినిచ్చిన అంశమని మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలిపారు.

జగిత్యాల నియోజకవర్గంలోని బోర్నపల్లి వంతెన నిర్మాణం చేపట్టాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకురాగా మంజూరు చేశారని బోర్నపల్లి,కమ్మునూరు బ్రిడ్జిల నిర్మాణం దగ్గరుండి పర్యవేక్షించానని పేర్కొన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు పర్యాయాలు అధికారం చేపట్టిన గడిచిన 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు, ఇళ్లను ఇవ్వలేదని పేర్కొన్నారు. 18 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లను, ఉచిత బస్సు, ఉచిత విద్యుత్తు, సన్నబియ్యం వంటి మహోన్నత కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. 42 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గుర్రం మహేందర్ గౌడ్,నాయకులు కొయ్యేడి మహిపాల్,బాపురపు నర్సయ్య,బత్తిని భూమయ్య, కోడిపెల్లి ఆంజనేయులు,తలారి రాజేష్,పొన్నం శ్రీకాంత్,చింతల పెళ్లి గంగారెడ్డి,బత్తిని నాగరాజు, నరసింహారెడ్డి,ఏలేటి రాజేందర్,రాజీవ్,జలపతి రెడ్డి, ఉప్పు లక్ష్మణ్,రాజారెడ్డి,మసుద్,శివ,రాజేష్,రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.