# Tags
#తెలంగాణ #జగిత్యాల #హైదరాబాద్

తెలంగాణ బ్రాహ్మణ సేవాసంఘాల సమాఖ్య వ్యవస్థాపక చైర్మన్ గా వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ, అధ్యక్షులుగా మోతుకూరు రామేశ్వరశర్మ ఎన్నిక

తెలంగాణ బ్రాహ్మణ సేవాసంఘాల సమాఖ్య వ్యవస్థాపక చైర్మన్ గా వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ, నూతన అధ్యక్షులుగా మోతుకూరు రామేశ్వరశర్మ ఎన్నికయ్యారు.

TBSSS నూతన అధ్యక్షుడు

ఆదివారం హైదరాబాద్, స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ సన్నిధిలో జరిగిన తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘాల సమాఖ్య అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి ఎన్నికలలో వ్యవస్థాపక చైర్మన్ గా వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ, నూతన అధ్యక్షులు గా మోతుకూరు రామేశ్వరశర్మ,

వైద్య ప్రభాకర్ శర్మ, సముద్రాల విజయసారధి

రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వైద్య ప్రభాకర శర్మ మరియు కోశాధికారిగా సముద్రాల విజయసారధి లు ఎన్నికయ్యారు.

ఈ సందర్బంగా జగిత్యాల తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘాల సమాఖ్య పూర్వ ఉపాధ్యక్షుడు సిరిసిల్ల శ్రీనివాస్ మరియు  ప్రతినిధులు ఎస్పీ సుబ్రహ్మణ్యం, సిరిసిల్ల రాజేంద్ర శర్మ, చిలుకమర్రి మదన్ మోహన్, మెట్ట మహేందర్ లు నూతన కార్యవర్గంకు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు.