#తెలంగాణ #జగిత్యాల

VIBRANCE – 2025: ఆకాశమే హద్దుగా – మానస స్కూల్ విద్యార్థుల, చిన్నారుల వార్షికోత్సవం సందడి

జగిత్యాల 

పట్టణంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ వారి వార్షికోత్సవం ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆకర్షణ గా నిలిచిపోయింది. “VIBRANCE – 2025: ఆకాశమే హద్దుగా” అన్న నినాదంతో శుక్రవారం ఉదయం నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన ఈ వేడుక పద్మనాయక కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమాన్ని పాఠశాల చైర్మన్ శ్రీమతి జోగినపల్లి మంజుల రమాదేవి రవీందర్ రావు మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, పాఠశాల డైరెక్టర్ లు శ్రీధర్ రావు ,హరిచరణ్ రావు ,సుమన్ రావు,మౌనిక రావు,  ప్రిన్సిపాల్ రజిత రావు లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమం ఆద్యంతం పండుగలా ఉత్సాహంగా సాగింది. విద్యార్థినీ విద్యార్థులు , చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు,  పాటలు, నాటికలు – అన్నీ ఆహ్లాదాన్ని అందించాయి . చిన్న పిల్లల నుంచి పెద్దవారివరకు స్టేజ్ మీద చేసిన ప్రదర్శనలు చూసి ప్రేక్షకులంతా హర్షించారు.

వేదిక నిండా రంగురంగుల వెలుగులు, పిల్లల ఉత్సాహం, తల్లిదండ్రుల చప్పట్లు… అన్నీ కలసి ఒక పండగ వాతావరణంను తీసుకొచ్చాయి. తమ తమ పిల్లల కళను చూసిన తల్లిదండ్రులు ఆనందం తో ఉప్పొంగిపోయారు.

“ఈ తరం పిల్లలు చదువుతోపాటుగా అన్ని రంగాల్లోనూ ముందుండగలరన్న నమ్మకాన్ని మానస స్కూల్ ఇచ్చింది,” అని తల్లిదండ్రులు అభినందించడం పాఠశాల నిబద్ధతకు నిదర్శనం అని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్ పాఠశాల యాజమాన్యం ను అభినందించారు.

పాఠశాల ప్రిన్సిపాల్ రజిత రావు మాట్లాడుతూ – “పిల్లల ప్రతిభను మెరుగుపర్చే అవకాశం ఇలాంటివేననీ, వారు కలలు కనాలి, వాటిని నెరవేర్చే దారిలో మేము తోడుగా ఉండాలన్నదే తమ మానస స్కూల్ లక్ష్యం,” అన్నారు.
ఈ వేడుకతో విద్యార్థులలో కొత్త ఉత్సాహం, తల్లితండ్రులలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందన్నారు.

ఈ ఏడాది వార్షికోత్సవం ఒక వినోదం కాదు – ఒక స్ఫూర్తి, ఒక ప్రయాణం! అన్నట్టుగా నిలిచిపోయిందనీ, మానస స్కూల్ చూపించిన దిశ – “ఆకాశమే హద్దుగా!” అని నిరూపించిందని పాఠశాల డైరెక్టర్ లుఈ సందర్భంగా కొనియాడుతూ,  ఈ వేడుకలో పాల్గొన్న విద్యార్థులు, చిన్నారులు, వారి తల్లితండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *