# Tags

రాయికల్ మండలంలో “పల్లెల్లో పనుల జాతర” కార్యక్రమం:1 కోటి 30 లక్షలతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 

రాయికల్ : ఎస్.శ్యామ్ సుందర్ :

మండలంలో శుక్రవారం మధ్యాహ్నం 12:30 నుంచి 4 గంటల వరకు వివిధ గ్రామాల్లో పల్లెల్లో పనుల జాతర కార్యక్రమం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని, ఆలూరు,వీరాపూర్,ధర్మాజీ పెట్,తాట్లవాయి,కట్కా పూర్, దావన్ పల్లి, వస్తాపూర్, చింతలూరు, బోర్నపల్లి గ్రామాల్లో 1 కోటి 30 లక్షలతో సీసీ రోడ్డు,డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

అలాగే బోర్నపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పల్లె దవాఖానాను ప్రారంభించారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 5 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…దొడ్డు బియ్యం రీసైక్లింగ్ చేసి అమ్మితే జైలుకే అని, పోలీస్, రెవెన్యూ అధికారులు దృష్టి సారించాలని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి పనిచేసి జగిత్యాల నియోజకవర్గ  అభివృద్ధి కి రాజకీయాలకతీతంగా కృషి చేస్తాననీ అన్నారు.రాష్ట్రంలో అత్యధిక పల్లె దవాఖానలు జగిత్యాలకు 14 మంజూరు కాగా రాయికల్ కు 6 పల్లె దవాఖానలు మంజూరు చేయటం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ లు ఏనుగు మల్లారెడ్డి, దిటి రాజిరెడ్డి,డిప్యూటీ DMHO శ్రీనివాస్,ఎంపీడీవో చిరంజీవి, ఎంపీఓ, ఏఈ ప్రసాద్,నాయకులు కోల శ్రీనివాస్, రవీందర్రావు, గన్నెరాజిరెడ్డి, ముకీద్, సురేందర్ నాయక్ ,

అనుపురం శ్రీనివాస్, తిరుపతి గౌడ్, శ్రీనివాస్ గౌడ్, భాస్కర్ రావు, మల్లయ్య,పాదం లత రాజు ,సురేందర్ రెడ్డి, స్నేహలత హరీష్, వెంకటేష్, శ్రీనివాస్ ,మల్లేశం, రాజమౌళి, రవి ,ముజాహిద్,పెండ్రం కవిత శ్రీనివాస్, బీర్స ,రామస్వామి, కిషన్ రావు,ప్రవీణ్ రావు, రాజన్న ,రామ్ రెడ్డి ,రాజశేఖర్, వెంకటేశ్వర రావు, రామచంద్రరావు, మల్లయ్య ,రాజిరెడ్డి, అధికారులు, నాయకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

▪️రాయికల్ మండలం ధర్మాజి పెట్ లో మ్యాకల సరస్వతి రాజిరెడ్డి గార్ల ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణ పనులను పరిశీలించారు.

▪️వస్తాపూర్ గ్రామానికి చెందిన రామావత్ లత మోతీలాల్ గార్ల ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్.

గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా మంజూరైన లబ్ధిదారులు కుంటాల ప్రమీల,జంగిలి సునీత,జింక సత్తవ్వ ల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేసారు.

గ్రామంలో డా.బి అర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.