# Tags

గర్భీణి స్త్రీని జెసిబి సాయంతో వాగు దాటించిన గ్రామస్థులు


ప్రసూతి కోసం రాయికల్ ఆస్పత్రికి అంబులెన్స్ లో తరలింపు


రాయికల్ : S.Shyamsunder

రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్కు చెందిన కళ్యాణి అనే గర్భీణి మహిళ నొప్పులు ఎక్కువై ప్రసూతి కోసం ఆస్పత్రికి వెళ్లేందుకు 108 వాహనానికి ఫోన్ చేసారు.

అయితే రాయికల్ మండలం రామాజీపేట, భూపతిపూర్ గ్రామాల మధ్య గల వాగు వరదనీటితో ఉదృతంగా ప్రవహిస్తుంది. వాగు దాక చేరిన వాహనం వరదతాకిడితో గ్రామానికి వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది.

ఈ వాగు వరకు చేరిన మహిళను స్థానిక యువకులు జెసిబి తెప్పించి ఆమెతో పాటు బంధువులను జెసిబిలో కూర్చోబెట్టి వాగు దాటించారు.

అనంతరం ఆమెను 108 వాహనంలో రాయికల్ ఆస్పత్రికి తరలించారు.