# Tags
#తెలంగాణ

ఎల్లారెడ్డిపేటలో రోడ్లపై నీళ్లు ప్రవహిస్తున్నాయి…జాగ్రత్త!

ఎల్లారెడ్డిపేట ప్రజలకు విజ్ఞప్తి: రాజన్న సిరిసిల్ల జిల్లాలో శనివారం నుండి కురుస్తున్న వర్షం వల్ల ఎల్లారెడ్డిపేటలో రోడ్లపై నీళ్లు ప్రవహిస్తున్నాయి.

తిమ్మాసికుంట నుంచి వచ్చే నీరు రోడ్డుపై ప్రవహిస్తున్నందున వాహనదారులు, పాదచారులు ఎల్లారెడ్డిపేట ఊర్లోకి వెళ్లే రహదారి నుండి వెళ్లకుండా, పాత బస్టాండ్ నెహ్రూ విగ్రహం నుండి ఊర్లోకి వెళ్ళగలరు. నీటిలో నుండి వెళ్లే సాహసం చేయవద్దు. జారి పడిపోయే ప్రమాదం ఉంది.