# Tags
#తెలంగాణ

మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను ఖండిస్తున్నాం : తెలంగాణ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.గోపిరెడ్డి

హైదారాబాద్ :

పోలీసు శాఖపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం : తెలంగాణ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.గోపిరెడ్డి

మాజీ మంత్రి హరీష్ రావు పోలీసు వ్యవస్థ మొత్తం కొలాప్స్ అయ్యిందని, పోలీసులను పని చెయ్యనివ్వడం లేదని, బూటకపు ఎంకౌంటర్లు జరుగుతున్నాయని, పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వారి పనులను వారు చేసుకోనివ్వాలని విమర్శించిన తీరును తెలంగాణ పోలీసు అధికారుల సంఘం ఖండించింది.

అది దురుద్దేశపూరితమైనదని పోలీసు శాఖ భావిస్తుందని, గత తొమ్మిదన్నరేండ్లు అధికారంలో ఉండి, నేడు పోలీసులను ఈ తీరుగా విమర్శించడం విస్మయం కలిగిస్తుంది.

తెలంగాణ రాష్ట్ర పోలీసులకు దేశంలోనే సమర్ధవంతమైన పేరు ఉంది. అందుకు అనుగుణంగానే డీజీపీ నేతృత్వంలో నేడు వరద భీభత్స ప్రాంతాల్లో పోలీసులు ప్రాణాలొడ్డి పని చేస్తున్న తీరు ప్రజలంతా మెచ్చుకుంటున్నారు.

నేడు సమర్థులైన అధికారులు సరైన స్థానాల్లో ఉండి సమర్ధవంతమైన పరిపాలన చేస్తున్నారు. నాడు అధికారులకు ఏవిధమైన స్వేచ్ఛ ఉండేదో మీకు తెలియదా? నేడు పోలీసులు చట్టప్రకారం పనిచేస్తూ ప్రజలకు మిత్రులుగా ఉంటున్నారు.

ఎలాంటి పైరవీలకు తావు లేకుండా పోలీసు వ్యవస్థ నిబద్దతతో పని చేస్తుంది. పోలీసు శాఖపైన ఎలాంటి వత్తిడి లేకుండా పని చేస్తున్నారు. ఎలాంటి అశాంతికి తావు ఇవ్వకుండా నేటి పోలీసు వ్యవస్థ నిత్యం శ్రమిస్తున్నది.

ప్రాణాలొడ్డి పోరాడుతున్న చర్యలను బూటకపు పనులుగా వర్ణించడం మీ మనసాక్షి ఒప్పుకుంటుందా అని ప్రశ్నిస్తున్నాం.

డయల్ 100, 112 అనేవి చాలా సమర్ధవంతంగా, నిరంతరాయంగా పనిచేస్తుంది. రోజూ లక్షల కాల్స్ తో నిత్యం బిజీగా పని చేస్తుంది. పోలీసులు సగటున 10 నిమిషాలకు నేర స్థలానికి చేరుకొని ప్రజలకు అండగా నిలుస్తున్నారు.

ఈ తుఫాను తీవ్రతలో కూడా ప్రజలు డయల్ 100 ద్వారా తక్షణ సహాయం పొందారు. ఎలాంటి ఇబ్బంది ఉన్నా వెంటనే గుర్తుకువచ్చే డయల్ 100 ను ఉద్దేశపూర్వకంగా ప్రస్తావించి ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపడాన్ని మానుకోవాలని కోరుతున్నాం.

పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీసి రాజకీయ లబ్ది పొందాలనే ప్రయత్నాన్ని, అసమంజస వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. , తమ రాజకీయ ప్రయోజనాలను ఆశించి, అహోరాత్రులు శ్రమిస్తున్న పోలీసులను కించపరుస్తూ మాట్లాడడం అత్యంత గర్హనీయం. దీనిని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ముక్త కంఠంతో ఖండిస్తుంది.

వై.గోపిరెడ్డి,
రాష్ట్ర అధ్యక్షులు,
తెలంగాణ పోలీసు అధికారుల సంఘం.