# Tags
#Blog

7 లక్షల 39 వేల మంది వినియోగదారులతో రూ.2918.20 కోట్ల వ్యాపారాన్ని అధిగమించాం : బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహణధికారి వనమాల శ్రీనివాస్

2918. 20 కోట్ల వ్యాపారాన్ని అధిగమించామని బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహణధికారి వనమాల శ్రీనివాస్ వెల్లడించారు.

71వ అఖిల భారత సహకార వారోత్సవాలను పురస్కరించుకొని, ది గాయత్రి సహకార అర్బన్ బ్యాంక్ లి., జగిత్యాల ఆవరణలో బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహణధికారి వనమాల శ్రీనివాస్ సహకార పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం జరిగిన సమావేశంలో, సహకార శాఖ అధికారులతో పాటుగా, ముఖ్య కార్యనిర్వాహణధికారి వనమాల శ్రీనివాస్, జనరల్ మేనేజర్ శ్రీలత మరియు సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్య కార్యనిర్వాహణధికారి వనమాల శ్రీనివాస్ మాట్లాడుతూ… సహకారరంగం సభ్యుల సంఘటిత శక్తితో దేశ ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. కేంద్రంలో 2021 జూలై ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పడడం భారత సహకార ఉద్యమాన్ని ప్రభావితం చేయడంలో కీలకమైన దిశగా నిలిచిందన్నారు.

భారతదేశంలో సహకార సంస్థలను ప్రోత్సహించడానికి, నియంత్రించడానికి మరియు మద్దతు ఇవ్వడానికి ఈ మంత్రిత్వ శాఖ ఏకీకృత వ్యవస్థను అందించిందనీ, ఈ శాఖ ఏర్పడ్డ తరువాత సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి అనేక చొరవలు చేపట్టిందన్నారు. ఇందులో 54 ముఖ్యమైన చొరవలు సహకార ఉద్యమం అన్ని రకాల సహకార వ్యవస్థను బలోపేతం చేయుటకు దోహదపడ్డాయన్నారు. తద్వార ఈ రంగానికి అనేక సవరణలు మరియు ప్రత్యేక సౌకర్యాలు అందించబడ్డాయని వివరించారు. పబ్లిక్ మరియు ప్రయివేట్ రంగాలతో పోల్చినప్పుడు వివక్ష లేకుండ సరిసమాన అవకాశాలు కల్పించబడ్డాయి. ప్రభుత్వ విధానాలలో సహకార సంస్థల కార్యక్రమాలు ఇప్పడు కేంద్ర బిందువుగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఆర్ధిక విధానాలు విజయవంతం కావడానికి (UNSDG) ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో మరియు వికసిత్ భారత్ నిర్మాణంలో సహకార సంస్థలను కీలకంగా పరిగణిస్తున్నారని వివరించారు.

సహకార వ్యవస్థలో భాగంగా, బ్యాంకింగ్ రంగంలో యూనిట్ బ్యాంకుగా 2000 సంవత్సరంలో జగిత్యాల కేంద్రంగా ప్రారంభించబడిన గాయత్రి బ్యాంకు నిరంతర కృషితో నేడు తెలంగాణలో కో-ఆపరేటివ్ బ్యాంకులలో రూ॥2918.20 కోట్ల వ్యాపారంతో మొదటి స్థానానికి చేరుకున్నామని….మరియు 7 లక్షల 39 వేల మంది వినియోగదారులను కలిగి దక్షిణ భారతదేశంలో బ్యాంక్ వినియోగదారుల్లో మొదటి స్థానానికి చేరుకున్నామని అన్నారు. అలాగే సహకారరంగంలో ఉంటూ కార్పోరేట్ బ్యాంకులకు ధీటుగా టెక్నాలజీ ఆధారిత సేవలనందిస్తూ వినియోగదారులకు ATM, AePS, UPI, IMPS, RTGS/NEFT వంటి అధునాతన సేవలను అందిస్తున్నామని అన్నారు.

ప్రస్తుతం 47 బ్రాంచీలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తరించామని, త్వరలో మరో 19 బ్రాంచీలను ప్రారంబించుటకు ఏర్పాట్లు చేస్తున్నామని… తద్వారా 66 బ్రాంచీల ద్వారా 699 మందికి ఉద్యోగ కల్పన చేయగలుగుతున్నామని అన్నారు. బ్యాంక్ అభివృద్ధిలో భాగమైన కేంద్ర మరియు రాష్ట్ర సహకార మంత్రిత్వశాఖ మరియు అధికారుల సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.

మరియు సబ్యుల ఆర్థిక తోడ్పాటుకై వ్యాపార రుణాలను, మార్ట్ గేజ్ రుణాలను, బంగారు ఆభరణాలపై రుణాలను, హౌసింగ్ రుణాలను, తదితర అన్నిరకాల రుణాలను తక్కువ వడ్డీకే అందిస్తున్నామని అన్నారు.

అలాగే బ్యాంకు 11-09-2024 తో 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25 వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందని, ఇట్టి సిల్వర్ జూబ్లీ సంవత్సరం సందర్భంగా 8.8% శాతం వడ్డీతో 444 రోజుల డిపాజిట్ ప్రత్యేక పధకాన్ని ప్రారంబించామని, ఇట్టి పధకం 11-09-2025 వరకు అమలులో ఉంటుందని తెలియజేశారు. ఇట్టి అవకాశాన్ని కష్టమర్లు వినియోగించుకోవాలని కోరారు.

బ్యాంకు సమావేశ మందిరంలో జరిగిన ఇట్టి కార్యక్రమానికి బ్యాంకు పాలకవర్గం, బ్యాంకు సిబ్బంది, సహకార సిబ్బంది మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.