#తెలంగాణ #జగిత్యాల #వ్యవసాయం

సాగుకు సరిపడా నీటిని అందించి రైతన్నలకు రంది లేకుండా చూస్తాం: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రైతన్నకు రంది లేకుండా చూస్తాం

  • తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి
  • ఉమ్మడిగా పనులు చేపట్టి…త్వరగా పూర్తి చేయాలి
  • కలికోట సూరమ్మ చెరువు సందర్శనలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
  • జగిత్యాల జిల్లా, రాజన్న సిరిసిల్ల కలెక్టర్లు బి , సత్య ప్రసాద్,సందీప్ కుమార్ ఝా, కలిసి చెరువు సందర్శన

రైతన్నకు రంది లేకుండా చూస్తామని, సాగుకు సరిపడా నీటిని అందించి రైతన్నలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. 

రుద్రంగి మండల పరిధిలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కలికోట సూరమ్మ చెరువును రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ క్షేత్ర స్థాయిలో సందర్శించారు. 

అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించే ప్రాజెక్టుల నిర్మాణం త్వరగా చేపట్టాలని నిర్ణయించడం జరిగిందని చెప్పారు.

కలికోట సూరమ్మ చెరువు నుండి కుడి, ఎడమ కాలువల ద్వారా సుమారు 43 వేల ఎకరాలకు సాగునీరు అందనుందని పేర్కొన్నారు. రైతన్నలకు సాగునీటిని సమృద్ధిగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. 

కలికోట సూరమ్మ చెరువు లో నష్టపోతున్న పైపు లైన్ చెరువులకు, బావులకు నష్టపరిహారం చెల్లించి.. పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించి, ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేర్చనున్నామని ప్రభుత్వ విప్ పేర్కొన్నారు. రేపు ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుపై  జగిత్యాల జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్లు నివేదిక అందజేయాలని కోరారు.

రైతన్నకు రంది లేకుండా ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేస్తుందని తెలిపారు. కలికోట సూరమ్మ చెరువును పూర్తి స్థాయిలో నిర్మించేందుకు రెండు జిల్లాల కలెక్టర్లు, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు సహకరించి, రైతులకు సాగునీటిని అందించేందుకు చేపడుతున్న ఘట్టంలో భాగస్వామ్యులు కావాలని ప్రభుత్వ విప్ కోరారు. 

  • ఫాజుల్ నగర్, మర్రిపల్లి చెరువు పనులు, జోగాపూర్ పంప్ హౌస్ పరిశీలన

వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్, మర్రిపల్లి గ్రామాల్లోని చెరువు పనులను, చందుర్తి మండలం జోగాపూర్ లోని పంప్ హౌస్ ను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ క్షేత్ర స్థాయిలో సందర్శించారు. మర్రిపల్లి లోని చెరువు బండ్ పనులు పూర్తిస్థాయిలో చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జోగాపూర్ పంప్ హౌస్ ను పరిశీలించి, ఏ విధంగా పంప్ హౌస్ ను నిర్వహిస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

ఈ పర్యటనలో వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్, శ్రీపాద ఎల్లంపల్లి ఈఈ సంతు ప్రకాశ్ రావు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *