# Tags
#తెలంగాణ

రెండు సంవత్సరాలుగా చెల్లించని మూల్యాంకన భత్యాలు వెంటనే అందేలా చర్యలు తీసుకుంటాం : అదనపు కలెక్టర్ బిఎస్ లత

జగిత్యాల :

జిల్లాలో పదవ తరగతి మూల్యాంకానానికి సంబంధించిన రెండు సంవత్సరాల గౌరవభత్యాలను (2022-23 , 2023-24) వెంటనే అందేలా చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ బిఎస్ లత అన్నారు..

గురువారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఉపాధ్యాయులకు పదవ తరగతి మూల్యాంకన భత్యాలు వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం అదనపు కలెక్టర్ బిఎస్ లతకు ఒక వినతి పత్రం అందజేశారు.

జిల్లాలో పదవ తరగతి మూల్యాంకన భత్యాలు గత రెండేళ్లుగా అందలేదని ఉపాధ్యాయులు మూల్యాంకన విధులకు హాజరు కావడానికి సుముఖంగా లేరని జిల్లా విద్యాధికారి కె . రాము మరియు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన అదనపు కలెక్టర్ సంబంధిత రాష్ట్ర అధికారులతో ఫోన్లో మాట్లాడారు.  

ఈ-కుబేర్ లో  పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల మూల్యంకాన బత్యాలను వెంటనే ఉపాధ్యాయుల ఖాతాల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  ఈ మేరకు సంబంధిత అధికారులతో మాట్లాడిన అనంతరం

అదనపు కలెక్టర్ బిఎస్ లత తపస్ ఉపాధ్యాయ సంఘ నాయకులతో మాట్లాడుతూ,ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయిస్తామన్నారు..

కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోనగిరి దేవయ్య బోయినపల్లి ప్రసాదరావు రాష్ట్ర అసోసియేటు అధ్యక్షులు అయిల్నేని నరేందర్ రావు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒడ్నాల రాజశేఖర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.