సేవలు భేష్ అనిపించుకోవడం అభినందనీయం : జగిత్యాల
విద్యుత్ శాఖ ఎస్ఇ సుదర్శనం
కోరుట్ల :
కరెంటోళ్ళు కంటి రెప్పవాల్చలే సేవలు భేష్.. సమన్వయంతో సైనికుల్లా పని చేశారు శభాష్..అని అందరినోటా అనిపించుకొనేలా అంకితభావంతో పని చేయడం అభినందనీయం జగిత్యాల విద్యుత్ శాఖ ఎస్ఇ సుదర్శనం అన్నారు.

వినాయక నవరాత్రోత్సవాలు ఆరంభం నుండి నిమజ్జనోత్సవం నిర్వహించే వరకు ప్రత్యేక శ్రద్ద తీసుకొని ఎక్కడికక్కడ సిబ్బంది విగ్రహాలు తరలింపులో జాగ్రత్తలు పాటిస్తూ, అవసరమైన మరమ్మత్తులు గుర్తించి సకాలంలో పూర్తి చేసి విగ్రహాలు తరలింపు, మండపాల ఏర్పాట్లలో సేవలు అందించారని ఎస్ఇ సుదర్శనం తెలిపారు.
కోరుట్ల పట్టణంలో నవరాత్రోత్సవాల్లో సుమారు 160 మండపాలలో ఎక్కడా సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టి ప్రతీ నిర్వాహకులు వరకు విద్యుత్ శాఖ భద్రతా సూచనలు, సలహాలు అందించారన్నారు. గురువారం నుండి శుక్ర, శని, ఆది వారం వరకు నాలుగు రోజులు నిమజ్జనోత్సవాల్లోనే నిమగ్నమై నిద్రాహారాలు మాని నిరంతరాయ సేవలు అందించిన సిబ్బందిని ఎస్ఇ సుదర్శనం అభినందించారు.

పట్టణంలో శోభాయాత్ర మార్గాన్ని క్షుణ్ణంగా పరిశీలించి విద్యుత్ సమస్య తలెత్తకుండా పనిచేశారని కొనియాడారు. అవసరమైన చోట ఇంటర్నెట్, డిష్ కేబుళ్ల తొలగిoపు, అవసరమైన చోట ఎత్తు స్థంబాలు వేసి తీగలు సరి చేశారని చెప్పారు.
విద్యుత్ సిబ్బంది జాకెట్స్, క్యాప్స్ ధరించిన సేవలు అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎస్ఇ సుదర్శనం, డీఇ మధుసూదన్, వినాయక నవరాతోత్సవాలలో విశేష సేవలు అందించిన విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందిని ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు, వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులు కొనియాడారు.
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో సైనికుల్లా కోరుట్ల ఏడీఇ బి. రఘుపతి, ఏఇలు శ్యామ్, సత్యనారాయణ, సబ్ ఇంజనీర్ లు శశిధర్, ప్రశాంత్, ఫోర్మెన్ రాజవీరు, లైన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, మిస్కిన్, లైన్ మెన్ వేణు, రమేష్, శ్రీనివాస్, వేణు, తిరుపతి, రమేష్, కిరణ్, రాకేష్ తదితర సిబ్బంది పని చేసి అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల, ప్రజల మన్ననలు పొందారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





