# Tags
#తెలంగాణ

కోనో కార్పస్ మొక్కను తొలగించేది ఎప్పుడు!

( తెలంగాణ రిపోర్టర్):-

ప్రాణాంతక మొక్క వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు సంభవిస్తాయి.

భూగర్భ జలాలు హరించి వేస్తుంది.

పక్షులు, కీటకాలు కూడ ఈ మొక్కపై వాలవు

రాజన్న సిరిసిల్ల జిల్లా:

ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామం సిరిసిల్ల-కామారెడ్డి ప్రధాన రహదారి అయిన డివైడర్ మధ్యలో కోనో కర్పస్ మొక్కలకు గ్రామపంచాయతీ సిబ్బంది నీటి ట్యాంకర్ తో నీళ్లు పోస్తూ విషపు మొక్కలను కంటికి రెప్పలాగా కాపాడుతుంది.

విదేశపు మొక్క అయిన కోనో కార్పస్ పుష్పం నుండి వెలబడే పుప్పొడి రేణువులు ప్రజలకు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు సంభవిస్తాయని ఈ యొక్క మొక్క భూగర్భ జలాలు హరించి వేస్తుందని ఈ ముక్క పైన పక్షులు,కీటకాలు సైతం వాలయని వృక్ష పర్యావరణ నిపుణులు తెలుపుతున్నారు.

మన దేశంలో గుజరాత్, కర్ణాటక, అస్సాం రాష్ట్రాలు ఈ యొక్క మొక్కను నిషేధించాయి, ఇటీవలే తెలంగాణ అసెంబ్లీలో కూడా కోనో కార్పస్ మొక్కను తొలగించాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు.

తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ యొక్క మొక్క నిషేధం ఉంది అయినను అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా మొక్కలకు నీటిని పోస్తూ కంటికి రెప్పలుగా కాపాడుతూ చోద్యం చూస్తున్నారు, వెంటనే ఈ మొక్కలను తొలగించి వాటి స్థానంలో వేరే మొక్కలను నాటాలని ప్రజలు వేడుకుంటున్నారు.