#తెలంగాణ

జగిత్యాల జిల్లా…

ఆటల్లో గెలుపోటములు సహజం, ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

*క్రీడల్లో పాల్గొన్న యువత యాంటీ డ్రగ్స్ వారియర్ గా పనిచేయాలి

*యువత భారీ ఎత్తున పాల్గొని విజయవంతంగా పూర్తి అయిన వాలీబాల్ టోర్నమెంట్

*వాలీబాల్ విజేతలకు బహుమతి ప్రదానం

పోలీస్ అమరవీరుల సంస్మరణలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయ వాలీబాల్ గ్రౌండ్ నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ.. జిల్లా పోలీసులకు మరియు యువతకు సత్సంబంధాలు మెరుగుపరచాలని జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మెగా వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించడం జరిగిందని గడిచిన కొన్ని రోజులుగా పోలీస్ సర్కిల్ స్థాయిలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించి గెలుపొందిన వారిని ఈరోజు జిల్లా స్థాయిలో నిర్వహించడం జరిగిందని అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసం కలిగిస్తాయని, ఏ ఆటలోనైనా గెలుపు,ఓటమి అనేది సహజం కాని చివరి వరకు పోరాడాలి అన్నారు. ప్రతి ఒక్కరిలో టీమ్ స్పిరిట్ ఉండలని అపుడే విజయం మన చెంతకి చేరితుందని అని అన్నారు. ఇక్కడకి వచ్చిన క్రీడాకారులు మంచి ప్రతిభ చూపించారన్నారు. భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలలో ఆడాలని అన్నారు.యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా నైపుణ్యాభివృద్ది చేసుకొని చదువు,క్రీడలపై దృష్టి సారించాలని, ఈ టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారుడు యాంటీ డ్రగ్స్ వారియర్ గా పనిచేసి డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడంలో కృషి చేయాలని సూచించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి,శారీరక దృఢత్వానికి దోహదపడుతాయి. స్పోర్ట్స్ కోటా తో కూడా ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. క్రీడల పోటీల నిర్వహణకు పోలీస్ శాఖ తరుపున యువతకు ఎల్లవేళలా సహకరించి, ప్రోత్సహిస్తామని అన్నారు.యువకులు చెడు అలవాట్లకు, ఇతర చెడు మార్గాల వైపు మరలకుండా చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఉద్యోగాలు సంపాదించి, తమ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని, గ్రామానికి మంచి గుర్తింపు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా గెలుపొందిన మొదటి మూడు జట్లకు షీల్డ్ మరియు నగదు బహుమతిని అందజేసి అభినందించారు. ఈ యొక్క మెగా వాలీబాల్ టోర్నమెంట్ను విజయవంతం చేయడం లో కృషి చేసన పోలీస్ అదికారులు, సిబ్బంది ఈ యొక్క వాలీబాల్ టోర్నమెంట్ను కు సహకరించిన పీఈటీలకు ప్రత్యేకంగా శాలువాతో సత్కరించి షీల్డ్ ను అందజేసి అభినందించారు.

*మొదటి బహుమతి జగిత్యాల రూరల్ జట్టు
*రెండవ బహుమతి మెట్ పల్లి జట్టు
*మూడవ బహుమతి కోరుట్ల జట్టు

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీం రావ్, డిఎస్పీలు రవీంధ్ర కుమార్, రఘు చందర్, ఉమా మహేశ్వర రావు, ఆర్.ఐ లు కిరణ్ కుమార్, రామక్రిష్ణ, వేణు, ఐటి కోర్,DCRB ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్,రఫిక్ ఖాన్, పోలీస్ సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *