# Tags
#తెలంగాణ #హైదరాబాద్

మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చేతులమీదుగా వింధ్య గౌరవ్ జాతీయ అవార్డు అందుకున్న మహిళా ఆడియో ఇంజనీర్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత డా.సాజిదాఖాన్

హైదరాబాద్ :

మొదటి మహిళా ఆడియో ఇంజనీర్ మరియు ప్రతిష్టాత్మక రాష్ట్రపతి అవార్డు గ్రహీత,  డాక్టరేట్ పొందిన కుమారి సాజిదా ఖాన్ ఈ జనవరి 16న మధ్యప్రదేశ్, భోపాల్‌లో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో వింధ్య గౌరవ్ జాతీయ అవార్డు సీజన్ 5 – 2026ను అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి రాజేంద్ర శుక్లా మరియు మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుండి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

కార్యక్రమ నిర్వాహకులు స్నేహ ఈవెంట్ అండ్ మేనేజ్‌మెంట్స్ & శివి ఎంటర్‌ప్రైజెస్ విష్ణు మిశ్రా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో….

మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి రాజేంద్ర శుక్లా చేతులమీదుగా మొదటి మహిళా ఆడియో ఇంజనీర్ మరియు ప్రతిష్టాత్మక రాష్ట్రపతి అవార్డు గ్రహీత డాక్టరేట్ పొందిన సాజిదా ఖాన్ “వింధ్య గౌరవ్ జాతీయ అవార్డు” సీజన్ 5 – 2026ను అందుకున్న సందర్బంగా సాజీదాఖాన్ కు  పలువురు శుభాకాంక్షలు అందిస్తున్నారు.