# Tags
#తెలంగాణ

పట్టభద్రుల పరిష్కారానికి కృషి :ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ

రాయికల్ : ఎస్. శ్యామసుందర్

పట్టభద్రులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అన్నారు.

శనివారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయికల్ మండలంలోని వీఎస్ గార్డెన్ లో పట్టభద్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. పట్టభద్రుల ఓటు అనేది వజ్రాయుధం కంటే పదునైనదని, ఆగం కాకుండా ఆలోచించి ఓటు వేయండని పిలుపునిచ్చారు. మనం చదువుకున్న విజ్ఞులమని, పట్టభద్రుల శ్రేయస్సు కోరుకునే వాడినని ముఖ్యంగా ప్రజలతో ఉండేవాడిని ఎన్నుకోవాలన్నారు.

ఎమ్మెల్సీఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వారి మెజార్టీతో గెలిపించాలని పట్టబద్రులను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముసిపట్ల రాజేందర్, బ్రహ్మండబేరి నరేష్, సత్యం, జగన్ మరియు 200 మంది పట్టభద్రులు పాల్గొన్నారు.