# Tags

ఈ నెల 07 వరకు ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు, పకడ్బందీగా నిర్వహణ: రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల జిల్లా : వెల్గటూర్ మండలం :

ప్రస్తుతం తల్లిదండ్రులు తమ బిడ్డకు అత్యుత్తమ సంరక్షణను అందించడంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటారని, ప్రసవం, అలాగే ప్రసవానంతర కాలంలో పిల్లల కోసం కొనసాగుతున్న సంరక్షణ కూడా చాలా ముఖ్యమైనదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

శనివారం జిల్లాలోని వెల్గటూర్ మండలంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ మైనారిటీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం సాయంత్రం 6-30 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో వివరించారు. ప్రతి సంవత్సరం ఆగష్టు మొదటి వారంలో తల్లి పాల వారోత్సవాలు అవగాహనా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ నెల 

07 వరకు ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు, పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ వివరించారని 

కలెక్టర్ కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది.

అనంతరం వెలగటూరు మండలానికి సంబంధించిన స్థంభంపల్లి దివ్యాంగుడికి సుమారు రూపాయలు 1,20,000 విలువగల స్కూటీని ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి డా.  బోనగిరి నరేష్, పతక శిశు సంక్షేమ అధికారిణి శ్రీమతి వాణిశ్రీ, సూపర్వైజర్లు పవిత్ర, ఆండాలు, పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ మధు, ఎఫ్ ఆర్ ఓ కొండయ్య పాల్గొన్నారు.

పుట్టిన గంట లోపు ముర్రు పాలు పట్టడం వలన కలిగే లాభాల, నార్మల్ డెలివరీ యొక్క ఇంపార్టెన్స్ గురించి వివరించారనీ, తల్లిపాలు ఎంతో శ్రేయస్కరమైనవనీ, వీటిలో అనేక పోషకాలతో పాటు విటమిన్లు ఉంటాయి. వీటివల్ల బిడ్డడికి వివిధ వ్యాధుల నుండి వ్యాధి నిరోధక శక్తి సంక్రమిస్తుంది. బిడ్డ పుట్టిన వెంటనే మొట్టమొదట వచ్చేపాలని ముర్రుపాలు అంటారు.

ఈ ముర్రుపాలను బిడ్డ పుట్టిన మొదటి గంట లోపల బిడ్డకు తాగించాలి. అలాగే బిడ్డ పుట్టిన తర్వాత ఆరు నెలల వరకు కేవలం తల్లిపాల మీదనే పెంచాలి. ఎలాంటి ద్రవపదార్థాలు కానీ ఇతర పదార్థాలు కానీ ఇవ్వకూడదు.

మొత్తం 100 బాలింతలను తీసుకుంటే 65 మంది మాత్రమే బిడ్డకు పాలు ఇవ్వడం జరుగుతుంది. మరి అందుకే ప్రస్తుతం మన సమాజంలో అనేకమంది పిల్లలు బలహీనంగా పుట్టడం జరుగుతుంది.

భవిష్యత్తులో బిడ్డ ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు రావద్దు అనుకుంటే ప్రతి తల్లి తమ బిడ్డకు పుట్టిన గంటలో పాలు తాగించి ఆ తర్వాత ఆరు నెలల వరకు కేవలం తల్లిపాల మీద పెంచాలని తెలిపారు.

తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే కరపత్రాలను విడుదల చేశారు.