# Tags
#తెలంగాణ

పువ్వులను పూజించడం తెలంగాణ గొప్ప సంస్కృతి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్…

రాజన్న సిరిసిల్ల

(తెలంగాణ రిపోర్టర్)
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆడపడుచుల ఆట పాటలు, కోలాటాలతో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా ఎస్పీ కుటుంబ సమేతంగా హాజరై వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఎక్కడైనా దేవుళ్లకు పూలు పెట్టి కొలుస్తాము, కానీ పువ్వులనే దేవతగా కొలిచే సాంప్రదాయం ఒక తెలంగాణ లో మాత్రమే ఉందన్నారు. తెలంగాణ సంస్కృతికి చారిత్రక చిహ్నం బతకమ్మని మరియు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయి అని తెలిపారు. పోలీసు వారి కుటుంబ సభ్యులతో బతుకమ్మ ఆడటం ఇంత మంది కుటుంబ సభ్యులను కలిసినందుకు వారితో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో, వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు,ఆర్.ఐ లు మరియు ఎస్.ఐ లు మహిళా సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *