# Tags
#తెలంగాణ

మీడియా పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న యూసుబ్ అనే వ్యక్తి అరెస్ట్,రిమాండ్ కు తరలింపు

రాజన్న సిరిసిల్ల జిల్లా,(తెలంగాణ రిపోర్టర్)సంపత్ కుమార్ పంజ…

మీడియాలో రిపోర్ట్స్ గా పెట్టిస్తానట్టు అధికమొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ,అక్రిడిటేషన్ కార్డ్స్ ఇప్పించి ప్రభుత్వం ద్వారా వచ్చే డబుల్ బెడ్ రూమ్స్, ఫ్లాట్స్ ఇప్పిస్తా అంటూ మోసాలు చేస్తున్నాడని అతని వివరాలు వెల్లడించిన వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి

ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ..
వేములవాడ పట్టణం రుద్రవరం గ్రామం ఆర్ అండ్ ఆర్ కాలనీ చెందిన ఎండి యూసుబ్ , తండ్రి ఇస్మాయిల్ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాల నుండి నేషనల్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో విలేఖరిగా పనిచేస్తున్నానని, మల్యాల గ్రామనికి చెందిన రొండి చంద్రయ్య అను వ్యక్తికి, అదే రంగంలో పనిచేస్తున్న చొక్కాల వనజ, పీసరి శ్రీనివాసుల ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో విలేఖరిగా చేర్పించి,అక్రిడిటేషన్ కార్డులు ఇప్పించి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ పొందవచ్చని మరియు డబుల్ బెడ్ రూమ్ లు ఇప్పిస్తానని ఆశ చూపి, అతని నుండి డబ్బులు వసూలు చేసి మోసం చేసినారు.ఇదే విధంగా రామన్నపేట గ్రామానికి చెందిన ఆరుట్ల ఆది మల్లయ్యకు కూడా అసైన్డ్ భూమి ఇస్తానని డబ్బులు వసూలు చేసినారు.ఇట్టి ఫిర్యాదుపై చందుర్తి పోలీస్ స్టేషన్లో కేసు కాగా గతంలో చౌక్కాల వనజ మరియు కీసర శ్రీనివాస్ లను అరెస్టు చేసి రిమాండ్ తరలించనైనది. అప్పటి నుండి తప్పించుకుని తిరుగుతున్న ఎండి యూసుబ్ ను అదుపులోకి తీసుకొని జ్యూడిషియల్ రిమాండ్ కి తరలించడం జరిగిందని ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి తెలిపారు.